NTV Telugu Site icon

Free Sanitary Products: మహిళలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందిస్తున్న తొలిదేశం ఇదే..!!

Scotland

Scotland

Scotland is first country to give Free Sanitary Products: మహిళలకు తమ జీవిత కాలంలో శానిటరీ ప్యాడ్లు చాలా అవసరం. అయితే ప్రపంచంలో చాలా మంది మహిళలు ఆర్ధిక సమస్యల కారణంగా పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటున్నారు. అయితే మహిళలందరూ నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించి తీరాలి. లేకపోతే అనారోగ్యం దరిచేరి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి ఓ దేశం మహిళలకు పీరియడ్స్ ప్రొడక్టులకు ఉచితంగా అందజేస్తోంది. ఆగస్టు 15 నుంచే స్కాట్లాండ్ దేశం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కాట్లాండ్‌లో నేటి నుంచి పీరియడ్స్‌కు సంబంధించిన ప్రొడక్టులన్నీ ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు శానిటరీ ప్యాడ్స్, టాంపన్స్, పోషకాహారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఫ్రీగా లభిస్తాయి.

Read Also: Jio 5G Smart Phone: జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ధర ఎంత ఉంటుంది?

2020లోనే స్కాట్లాండ్‌ ఉచిత పీరియడ్‌ ప్రొడక్ట్స్‌ చట్టాన్ని తెరపైకి తీసుకువచ్చింది. నవంబర్‌ 2020లో అక్కడి పార్లమెంట్‌ ఈ చట్టానికి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ చట్టం ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి రుసుము లేకుండా శానిటరీ ఉత్పత్తులు అందించబడ్డాయి. ప్రస్తుతం ఈ బిల్లులో సవరణలను అధికారులు ఆమోదించారు. దీంతో దేశంలోని ప్రతి మహిళకు శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ చట్టం అమల్లో్కి రావడానికి స్కాట్లాండ్‌లో చాలా పోరాటాలే ఉరిగాయి. కాగా ఉచిత పీరియడ్‌ ఉత్పత్తులు అందించడం సమానత్వం, గౌరవానికి సంబంధించిన విషయమని.. ఈ అంశం మహిళలకు ఆర్ధిక అడ్డంకులను తొలగిస్తుందని సామాజిక న్యాయ కార్యదర్శి షోనా రాబిసన్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా పీరియడ్ ఉత్పత్తులకు ఎవరూ దూరంగా ఉండకూడదనే తమ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని ఆమె తెలిపారు.