Site icon NTV Telugu

Israel- France: ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్ ద్రోహం.. ముస్లింలను చంపడానికి ఆయుధాలు ఇవ్వమని వెల్లడి

Isreal

Isreal

Israel- France: గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్ సమీపంలోని ఫోస్-సుర్-మెర్ ఓడరేవులోని డాక్ కార్మికులు బుల్లెట్లను వేగంగా పేల్చడానికి మెషిన్ గన్‌లలో ఉపయోగించే చిన్న మెటల్ లింక్‌లతో కూడిన 19 ప్యాలెట్‌లను ఇజ్రాయెల్ వైపు లోడ్ చేయడానికి నిరాకరించారు. ఈ చర్య ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ మాత్రమే కాదు.. ఫ్రెంచ్ ప్రభుత్వ విధానం గురించి కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అయితే, ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మారణహోమంలో తాము పాల్గొనలేమని యూనియన్ సీజీటీ తేల్చి చెప్పింది.

Read Also: Chevireddy Bhaskar Reddy: తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే రియాక్షన్..!

అయితే, గాజాలోని ముస్లింలను చంపడానికి ఫ్రాన్స్ పంపించే ఆయుధాల గురించి గురువారం తనకు సమాచారం అందిందని డాక్ కార్మికుల నాయకుడు క్రిస్టోఫ్ క్లేర్ అన్నారు. డాక్ కార్మికులు ఒక కన్సైన్మెంట్ లోడ్ చేయడానికి నిరాకరించినప్పుడు, మరెవరూ దానిని తాకలేరని పేర్కొన్నారు. ఇక, కార్మికుల నిర్ణయాన్ని CGT యూనియన్ జనరల్ సెక్రటరీ సోఫీ బినెట్ ప్రశంసించారు. మా సహోద్యోగుల ఈ చర్య ఫ్రాన్స్ అంతర్జాతీయ మానవ హక్కుల విలువలకు చిహ్నమని అన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం వెంటనే ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Read Also: Shajan Padamsee : పెళ్లిపీటలెక్కిన రామ్ చరణ్‌ హీరోయిన్..

ఇక, ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను మాట్లాడుతూ.. ఈ భాగాలు కేవలం రవాణాలో ఉన్నాయి, ఇజ్రాయెల్ సైన్యం వాటిని ఉపయోగించదని అన్నారు. కానీ, అధికారిక జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవడం వల్ల ఇటువంటి వాదనలకు సీజీటీ కార్మికులు దిగుతున్నారని అతడు పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ తీసుకున్న ఈ చర్య ఇజ్రాయెల్‌కు దౌత్యపరంగా ఎదురుదెబ్బ అని చెప్పాలి.

Exit mobile version