NTV Telugu Site icon

Bill Clinton: అస్వస్థతకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌..

Bill Clinton

Bill Clinton

Bill Clinton: అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్‌ క్లింటన్ అస్వస్థతకు గురి కావడంతో వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని క్లింటన్‌ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అయితే, తీవ్ర జ్వరంతో బిల్ క్లింటన్ బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పుకొచ్చారు. తనకు అందుతున్న వైద్య సేవల పట్ల క్లింటన్ సైతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వెల్లడించారు. క్రిస్మస్ నాటికి మాజీ అధ్యక్షుడు క్లింటన్ ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Allu Arjun : నేడు పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్

అయితే, అమెరికా అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్ రెండు సార్లు (1993-2001) పని చేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన తర్వాత ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 2004లో తీవ్రమైన ఛాతీ నొప్పితో పాటు శ్వాసకోస సమస్యలు రావడంతో 4 సార్లు బైపాస్‌ సర్జరీ కూడా చేశారు వైద్యులు. ఆ తర్వాత ఏడాది ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి హస్పటల్ లో జాయిన్ అయ్యారు. 2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి ట్రీట్మెంట్ చేసి రెండు స్టంట్లు వేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బిల్ క్లింటన్ పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత 2021లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు శస్త్ర చికిత్స తీసుకోగా.. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ల తరఫున బిల్ క్లింటన్ చురుకుగా ప్రచారం చేశారు.

Show comments