Site icon NTV Telugu

US: మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు.. అమెరికాకు గుణపాఠం నేర్పారన్న పెంటగాన్ మాజీ అధికారి

Usmodi

Usmodi

ప్రధాని మోడీ దేశ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడాన్ని రూబిన్ తీవ్రంగా తప్పుపట్టారు. మోడీ నిర్ణయం.. అమెరికాకు నిజమైన గుణపాఠం నేర్పుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Maneka Gandhi: వీధి కుక్కలను షెల్టర్లకు పంపడమేంటి? సుప్రీంకోర్టు తీర్పును తప్పపట్టిన మేనకాగాంధీ

భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా అదనంగా మరో 25 శాతం సుంకం విధించారు. అయితే తమకు రైతులే ముఖ్యమని.. రాజకీయ అవసరాల కోసం రాజీపడబోమని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. అవసరమైతే రైతుల కోసం ఎంత భారమైనా సుంకాలు భరిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Trump: పుతిన్ మైండ్‌సెట్ నిమిషాల్లోనే తెలిసిపోతుంది.. అలాస్కా భేటీపై ట్రంప్ వ్యాఖ్య

తాజాగా భారత్‌పై విధించిన అమెరికా సుంకాలపై మైఖేల్ రూబిన్ స్పందిస్తూ.. దేశ ప్రయోజనాల కోసం మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారని కితాబు ఇచ్చారు. పరిపాలన మారిన తర్వాత భారత్ మంచి సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. మోడీ నిర్ణయంతో చరిత్రకారుల్లో గుర్తుండిపోతారన్నారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రంప్ భారీగా సుంకాలు విధించడం ఏ మాత్రం భావ్యం కాదన అభిప్రాయపడ్డారు. ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయని చెప్పారు.

రష్యా దగ్గర చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాపై మాత్రం ప్రస్తుతం ట్రంప్ ఎలాంటి సుంకాలు విధించలేదు. భారత్‌పై సుంకాలు విధించారు. దీంతో భారత్‌పై ట్రంప్ పక్షపాత వైఖరి అవలంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకోవైపు పాకిస్థాన్‌తో ట్రంప్ సంబంధాలు కొనసాగిస్తున్నారు.

 

Exit mobile version