NTV Telugu Site icon

AI Technology: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మనుషులు ప్రాణాలు తీస్తుంది.. గూగుల్ మాజీ సీఈఓ హెచ్చరిక..

Ai Technology

Ai Technology

AI Technology: ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే AI టెక్నాలజీ నుంచి మానవాళికి ముప్పు పొంచి ఉందని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నిబంధనలు పెట్టాలని పిలుపునిచ్చాడు.లండన్ లో బుధవారం వాల్ స్ట్రీట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ష్మిత్ 2001 నుండి 2011 వరకు గూగుల్ సీఈఓగా, 2015 నుండి 2017 వరకు దాని పేరెంట్ ఆల్ఫాబెట్‌కి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు.

Read Also: Bride Cancel Marriage: ప్రేమ పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తీసి వెళ్లిపోయింది.. అసలేమైంది?

AIతో ఆందోళనకర పరిస్థితులు ఉంటాయని, చాలా మందికి హానీ కలగడం లేదా చంపబడతారని హెచ్చరించారు. ప్రస్తుతం మాత్రం ఏం ప్రమాదం లేకున్నా..రాబోయే రోజుల్లో మాత్రం ఉండే అవకాశం ఉందని చెప్పారు. చెడు కోసం ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రముఖ AI కంపెనీలైన OpenAI, Google DeepMind, Anthropic ఉన్నతాధికారులు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను కలిసిన సమయంలోనే ష్మిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ తోపాటు చాలా మంది టెక్ సీఈఓలు AI టెక్నాలజీ హనీ కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. బిల్ గేట్స్ వంటి వారు మాత్రం ఇది అద్భుతమైన పురోగతి అని కొనియాడారు.