Bride Cancel Marriage: ప్రేమ పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తీసి వెళ్లిపోయింది.. అసలేమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bride Cancel Her Love Marriage After Watching Parents Pain: ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం కోసం యువతీ యువకులు ఎంతకైనా తెగిస్తారు. తల్లిదండ్రుల్ని కాదని, నచ్చిన వ్యక్తులతో వెళ్లిపోతారు. ఓ అమ్మాయి కూడా అదే పని చేసింది. తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి నిరాకరించడంతో.. ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన ప్రేమికుడ్ని పెళ్లి చేసుకుంది. కొత్త జీవితం మొదలుపెట్టాలని కలలు కంది. కానీ, ఇంతలోనే ప్రియుడికి షాకిస్తూ, ఆమె తాళి తీసి వెళ్లిపోయింది. అసలు ఏమైందంటే..
Looteri Dulhan: నిత్య పెళ్లికూతురు.. డబ్బుల కోసం ఎర వేసి..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తిరుపూర్‌పూండి రింగ్‌రోడ్‌కు చెందిన యువతి (23)కి కొంతకాలం క్రితం కోయంబత్తూర్ జిల్లా అన్నూర్ ఒటర్‌పాళయంకు చెందిన 29 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరు కలుసుకోవడం, చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఇద్దరి అభిరుచులు కలవడం, మనసులు దగ్గరవ్వడంతో.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. అయితే.. యువతి తరఫు బంధువులు మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కారణం ఏంటో తెలీదు కానీ.. ఆమె తల్లిదండ్రులు సైతం పెళ్లికి నిరాకరించారు. అయితే.. ఆ యువతి మాత్రం తన ప్రియుడి వదిలి ఉండలేకపోయింది. దీంతో.. ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించింది.
Karate Kalyani: మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్
ప్లాన్ ప్రకారం.. ఏప్రిల్ 17వ తేదీన ఆ అమ్మాయి తన పేరెంట్స్‌కి తెలియకుండా ఇంటి నుంచి పారిపోయింది. ఇంట్లో ఐదున్నర సవర్ల నగలతో పాటు రూ.5 లక్షల నగదు తీసుకుని.. ప్రియుడి వద్దకు వెళ్లింది. అక్కడే వీళ్లిద్దరు ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. తమకు భద్రత కల్పించాలని అన్నూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు.. యువతి తల్లిదండ్రులు వెలంపాళయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్లు ప్రేమజంటని పిలిపించారు. అక్కడ కుమార్తెను చూసి తల్లిదండ్రులు బోరన విలపించారు. అది చూసి యువతి మనసు కరిగిపోయింది. వెంటనే తన మనసు మార్చుకొని, ప్రియుడిది తప్పు లేదని చెప్పి, తాళి తీసిచ్చి, తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. పోలీసులు ఆ యువకుడికి సర్దిచెప్పి పంపించారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!