Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
- కుకీ దొంగతనం చేశాడని ఆరోపణ
- రూ.1.9 కోట్ల జీతం ఉద్యోగికి ఫోర్డ్ షాక్
- దొంగ అంటూ ఉద్యోగం తీసేశారు..
- చివరికి అసలు నిజం బయటపడింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ (Ford) ఒక ఉద్యోగిని కేవలం 1.95 డాలర్లు (సుమారు రూ.186) విలువైన కుకీ దొంగిలించాడనే ఆరోపణతో ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తర్వాత ఆ ఉద్యోగి తాను కుకీకి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు చూపించడంతో అసలు నిజం బయటపడింది.
రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగి
ఈ ఘటనలో బాధితుడు కర్ట్ క్రోమ్ (Kurt Kromm). 60 ఏళ్ల కర్ట్ గత 11 సంవత్సరాలుగా అమెరికాలోని కెంటకీ రాష్ట్రం, లూయిస్విల్లేలో ఉన్న ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆయన ఏడాదికి సుమారు 2 లక్షల డాలర్లు (దాదాపు రూ.1.9 కోట్లు) సంపాదిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, గత ఏడాది మాత్రమే కంపెనీ క్యాంటీన్లో 1,200 డాలర్ల (సుమారు రూ.1.14 లక్షలు) విలువైన ఆహారం, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసినట్లు చెప్పారు.
Also Read
- Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
- China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
- US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్‌లో కీలక త్రైపాక్షిక చర్చలు!
రూ.186 కుకీపై దొంగతనం ఆరోపణ
ఒక రోజు రక్తంలో చక్కెర స్థాయి తగ్గడంతో తల తిరుగుతున్నట్లు అనిపించడంతో కర్ట్, క్యాంటీన్లో Grandma’s Chocolate Chip Cookie కొనుగోలు చేశారు. కొద్ది సేపటికే ఆయనను సూపర్వైజర్ కార్యాలయానికి పిలిచారు. అక్కడ యూనియన్ ప్రతినిధి, సీసీటీవీ వీడియోలో కుకీ దొంగిలించినట్లు కనిపించిందని, కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించబోతోందని చెప్పినట్లు కర్ట్ వెల్లడించారు.
“నేను ఎందుకు దొంగతనం చేస్తాను?”
ఈ ఆరోపణలపై కర్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఏడాదికి రూ.1.9 కోట్లకు పైగా సంపాదిస్తున్నాను. అలాంటి నేను రూ.186 విలువైన కుకీని ఎందుకు దొంగిలిస్తాను? గత ఏడాది క్యాంటీన్లో రూ.1.14 లక్షలకు పైగా ఖర్చు చేశాను,” అని తెలిపారు. యూనియన్ ప్రతినిధి క్షమాపణ చెప్పాలని సూచించినప్పటికీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు.
బ్యాంక్ స్టేట్మెంట్తో నిర్దోషిత్వం నిరూపణ
తర్వాత తన బ్యాంక్ ఖాతాను పరిశీలించగా, 1.95 డాలర్ల చెల్లింపు విజయవంతంగా జరిగినట్లు గుర్తించారు. ఆ వెంటనే డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్‌ను ఫోర్డ్ యాజమాన్యానికి, యూనియన్ ప్రతినిధులకు పంపించారు. అయితే కంపెనీ ఆ ఆధారాలను వెంటనే అంగీకరించకుండా, బ్యాంక్ స్టేట్మెంట్ను నోటరీ చేయించి సమర్పించాలని కోరినట్లు తెలిపారు.
చివరికి నిజం ఒప్పుకున్న కంపెనీ
కొన్ని రోజుల తర్వాత క్యాంటీన్ నిర్వహిస్తున్న Aramark సంస్థ కర్ట్ కుకీకి చెల్లింపు చేసినట్లు అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఫోర్డ్ తిరిగి ఉద్యోగంలో చేరాలని ఆయనకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
అప్పటికే కొత్త ఉద్యోగంలో చేరిన ఉద్యోగి
అయితే అప్పటికే కర్ట్ తన ఇంటికి దగ్గరలో మరో కంపెనీలో మెరుగైన ఉద్యోగాన్ని స్వీకరించారు. కొత్త ఉద్యోగంలో ఆయనకు గంటకు 52.51 డాలర్ల వేతనం, అదనంగా గంటకు 10 డాలర్ల బోనస్ లభిస్తున్నట్లు తెలిపారు. ఫోర్డ్లో మాత్రం గంటకు 48 డాలర్లు మాత్రమే పొందుతున్నట్లు చెప్పారు.
సోషల్ మీడియాలో చర్చ
ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. రూ.186 విలువైన కుకీ విషయంలో పూర్తి విచారణ లేకుండానే ఉద్యోగిని దొంగగా ముద్రవేసి తొలగించడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- Cookie
- Ford
- Kurt Kromm
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త