Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!

  • ఫ్లైదుబాయ్ FZ1073 కాక్‌పిట్ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు
  • భారత కెప్టెన్ స్మిత్ మచార్‌పై కో-పైలట్ దాడి
  • కో-పైలట్ తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలంతో ప్రభావితమయ్యాడన్న నెతన్యాహు
Netanyahu

Netanyahu

Flydubai Attack:  ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి, విమానాన్ని కూల్చే ప్రయత్నంపై ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. యూఏఈతో కలిసి దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. ఈ దాడి ఘటనలో కో-పైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉన్నాడని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఈ ఘటన వెనక అతడికి ఎవరైనా సహకరించారా? ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత పైలట్ స్మిత్‌పై దాడి చేసిన కో-పైలట్‌ ఒమన్ జాతీయుడని ఇజ్రాయిల్ చెబుతోంది.

ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడుతూ.. భారత పైలట్‌పై దాడి చేసిన కో-పైలట్ “ఇస్లామిస్ట్ ఇండోక్ట్రినేషన్”కు గురయ్యాడని చెప్పారు. తీవ్రమైన ఇస్లామిక్ భావజాలాన్ని పదే పదే బోధించి, దానితో ప్రభావితం చేశారని అన్నారు. పైలట్ స్మిత్ మచ్చర్ కో-పైలట్ దాడికి గురైనప్పటికీ, రక్తమోడుతున్నప్పటకీ కాక్‌పిట్ తలుపులు తెరిచారు. దీంతో ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరి, కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని ఒక చిన్న ఎయిర్ పోర్టులో సుక్షితంగా విమానం ల్యాండైంది. ఈ ప్రమాదం నుంచి 180 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయాలపాలైన స్మిత్ ప్రస్తుతం యూఏఈలో చికిత్స పొందుతున్నారు.