Florida Teacher Arrested For Having Romantic Relationship With Minor Student At School: విద్యాబుద్ధులు నేర్పించిన ఓ టీచర్ దారి తప్పింది. తాను క్లాసులు చెప్పే ఓ మైనర్ విద్యార్థితోనే శృంగార కార్యకలాపాలు కొనసాగించింది. స్కూల్‌లోనే ఎవరు లేని ప్రాంతానికి ఆ విద్యార్థిని తీసుకెళ్లి, రాసలీలలు నడిపింది. చివరికి ఆ టీచర్ అడ్డంగా బుక్కవ్వడంతో.. కటకటాలపాలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలోని విన్‌త్రోప్ కాలేజ్ ప్రిపరేటరీ అకాడమీలో పైజ్ మోర్లీ అనే 22 ఏళ్ల యువతి టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తాను పాఠాలు చెప్పే క్లాస్‌లోని ఓ మైనర్ యువకుడి పట్ల ఆకర్షితురాలైన మోర్లీ.. స్కూల్ ముగిసిన తర్వాత సాయంత్రం పూట కొంతం సమయం గడపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నుంచి అతనితో రాసలీలలు మొదలుపెట్టింది. ఒక్కోసారి స్కూల్‌లోనే.. బ్రేక్ సమయంలో ఆ విద్యార్థిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అతనితో శృంగారంలో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఆ టీచర్ ఒకసారి పట్టుబడింది.
Kohli – Ashwin: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. కోహ్లీ – అశ్విన్ ఖాతాల్లో రికార్డులు
దీంతో.. స్కూల్ యాజమాన్యం మోర్లీపై చర్యలు తీసుకుంది. మైనర్ విద్యార్థితో ఇలాంటి ఎఫైర్ పెట్టుకోవడం చట్టరీత్యా నేరం కావడంతో.. ఆమెని విధుల్లో నుంచి తొలగించడంతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసింది. ఆమె నేరం రుజువు కావడంతో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్‌కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఎంతో నమ్మకస్తులైన మోర్లీ తనకున్న అధికారాన్ని, స్థాయిని ఇలా దుర్వినియోగం చేయడం నిజంగా దురదృష్టకరం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు వారిలో సానుకూల ప్రభావాన్ని నింపాల్సిన ఈ టీచర్.. అందుకు భిన్నంగా వక్రబుద్ధి చూపించి, ఉపాధ్యాయ పదవికే మచ్చ తెచ్చిందని మండిపడ్డారు. మరోవైపు.. మోర్లీపై అనేక చార్జెస్ నమోదు చేశారు. అశ్లీలకరమైన వేధింపులు, అసభ్యకరంగా ప్రవర్తించడం, విద్యార్థిని లోబరచుకోవడం, మైనర్‌తో రొమాంటిక్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం వంటి అభియోగాలు మోపారు. తన కామకోరికలు తీర్చుకోవడం కోసం తాను చేసిన ఈ తప్పుడు.. తన జీవితాన్ని నాశనం చేసుకుంది పైజ్ మోర్లీ.
Rapper Costa Titch: పాట పాడుతూ.. వేదికపైనే కుప్పకూలిన ర్యాపర్