Site icon NTV Telugu

Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి

Gazaidf

Gazaidf

ఇజ్రాయెల్ తాజాగా కొత్త రకం యుద్ధం మొదలుపెట్టింది. ఈసారి చేపట్టే ఆపరేషన్ తక్కువ సమయంలోనే ముగుస్తుందని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం సరికొత్త ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇన్ని నెలల నుంచి గాజాపై యుద్ధం చేస్తున్నా.. ఎప్పుడూ జర్నలిస్టులను టార్గెట్ చేసుకోలేదు. కానీ ఆదివారం మాత్రం జర్నలిస్టుల లక్ష్యంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు జర్నలిస్టులు మృతిచెందారు.

ఇది కూడా చదవండి: Sreeleela : శ్రీలీలకు తమిళ్‌లో మరో బంపర్ ఆఫర్?

ఆదివారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో జర్నలిస్టు ముసుగులో ఉన్న హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ తెలిపింది. అల్-షరీఫ్‌ను తామే చంపామని.. అతడు జర్నలిస్టుగా నటిస్తున్న హమాస్ ఉగ్రవాది అని పేర్కొంది. అల్-షరీఫ్ హమాస్‌కు చెందిన ఒక భాగానికి నాయకత్వం వహిస్తు్న్నాడని తెలిపింది.

ఇది కూడా చదవండి: Rain Alert : కొన్ని గంటల్లో కుండపోత.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

గాజా నగరంలోని అల్-షిఫా ఆస్పత్రి సమీపంలో జర్నలిస్టుల కోసం టెంట్ వేసి ఉంది. అందులో అల్ జజీరా జర్నలిస్టులు ఉన్నారు. అక్కడే అల్-షరీఫ్ కూడా ఉన్నాడు. ఇతడిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. అతడితో పాటు మరో నలుగురు జర్నలిస్టులు చనిపోయారు. మృతుల్లో అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహ్మమ్మద్ క్రీఖే, కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ ఉన్నట్లుగా బ్రాడ్‌కాస్టర్ తెలిపింది. ఏడుగురు చనిపోతే.. అందులో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నట్లు పేర్కొంది.

అల్-షరీఫ్.. గాజాలో పని చేస్తున్న ఒక ఛానెల్ రిపోర్టర్. అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తుల్లో అల్ షరీఫ్ ఒకరు. రోజువారీ నివేదికలు క్రమం తప్పకుండా కవరేజ్ చేస్తుంటాడు. అయితే ఇతడు హమాస్‌కు మద్దతుగా.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది. ఇక అల్ జజీరా ఛానల్‌ కూడా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పని చేస్తోంది. దీంతో ఆ ఛానల్‌ను ఇజ్రాయెల్ నిషేధించింది. అంతేకాకుండా ఈ ఛానల్‌కు ఖతార్ నిధులు కూడా సమకూరుస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌పై దాడుల ప్రణాళికలకు అల్ షరీఫ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించడంతో తాజా దాడుల్లో ఐడీఎఫ్ చంపేసింది.

 

Exit mobile version