తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల. ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, కోలీవుడ్ వైపు కూడా అడుగులు వేయడం ఆమె కెరీర్‌కి మరో మైలురాయి కానుంది. ఇప్పటికే ఆమె నటిస్తున్న తొలి తమిళ సినిమా ‘పరాశక్తి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శివ కార్తికేయన్ హీరోగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందట. ఈ ప్రాజెక్ట్‌తో తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్న శ్రీలీల, ఇంకా రిలీజ్ కాకా ముందే మరొక భారీ తమిళ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు టాక్.
తాజాగా సమాచారం ప్రకారం, కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందబోయే నెక్స్ట్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత అజిత్-అధిక్ కాంబినేషన్‌లో రానున్న ఈ రెండో సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఈ ప్రాజెక్ట్‌లో శ్రీలీల చేరితే, తమిళ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన నాయికగా శ్రీనిధి శెట్టి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, కథలోని మరో ముఖ్యమైన మహిళా పాత్ర కోసం శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇదే కనుక నిజం అయితే శ్రీలీల కెరీర్‌కి మరో పెద్ద బూస్ట్ అవుతుంది. ఎందుకంటే, తెలుగు – తమిళ్ – హిందీ మూడు భాషల్లో ఒకేసారి అవకాశాలు రావడం చాలా అరుదు. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.