Air Asia Flight: గాల్లో ఉండగా ఘర్షణ.. ప్రయాణికుడ్ని చితకబాదిన లేడీ గ్రూప్
- గాల్లో ఉండగా విమానంలో ఘర్షణ
- ప్రయాణికుడ్ని చితకబాదిన మహిళల గుంపు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానాల్లో గొడవలు కొత్తేమీ కాదు. పల్లె బస్సుల్లో కన్నా.. గాల్లోనే ఎక్కువ ఫైటింగ్‌లు జరుగుతున్నాయి. ఈ మధ్య వెలుగులోకి వస్తున్న వీడియోలను బట్టి అర్ధమవుతోంది. ఇక కొట్లాటకు తామేమీ తక్కువ కాదనుకున్నారో ఏమో తెలియదు గానీ.. ఈసారి నారీమణులు తమ పంజా చూపించారు. నిశ్శబ్దంగా ఉండాలని ఒక ప్రయాణికుడు చెప్పడమే పాపం అయింది. అంతే ఒక మహిళ గుంపు.. మగ ప్రయాణికుడిపై మూకుమ్మడి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Jaggery: రాత్రిపూట బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో..!
Also Read
కౌలాలంపూర్ నుంచి చైనాకు ఎయిర్ ఆసియా విమానం వెళ్తోంది. అయితే క్యాబిన్ లైట్లు ఆపిన తర్వాత కొంత మంది మహిళలు బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. సహచర మగ ప్రయాణికుడు అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో బిగ్గరగా మాట్లాడొద్దంటూ కోరాడు. అంతే ఆ మహిళలకు కోపం వచ్చేసింది. అతడితో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా ప్రయాణికుడ్ని చితకబాదారు. దీంతో విమాన సిబ్బంది, సహచర ప్రయాణికులు వచ్చి విడదీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: సెప్టెంబర్‌లో మోడీ అమెరికాలో పర్యటన! యూఎన్ సమ్మిట్‌కు హాజరయ్యే ఛాన్స్
విమాన సిబ్బంది వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది. లేదంటే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడేది. ఇక విమానం ల్యాండ్ అయ్యాక ఎటువంటి వైద్య సహాయం అవసరం రాలేదు. అంతేకాకుండా ఈ ఘటనలో ఎవర్నీ కూడా అరెస్ట్ చేయలేదు. అయితే ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో సిచువాన్ ప్రావిన్షియల్ పబ్లిక్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లోని ఎయిర్‌పోర్ట్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. విమాన ప్రయాణ సమయంలో ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా మర్యాదగా ఉండాలని అధికారులు సూచించారు.
A heated argument between passengers on an AirAsia flight from KL to Chengdu escalated into a mid-air brawl. The fight reportedly broke out after a man confronted a group of women for talking loudly after cabin lights dimmed pic.twitter.com/iWADiiPKHc
— @ (@anthraxxxx) July 23, 2025
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!