Site icon NTV Telugu

Air Asia Flight: గాల్లో ఉండగా ఘర్షణ.. ప్రయాణికుడ్ని చితకబాదిన లేడీ గ్రూప్

Airasiaflight

Airasiaflight

విమానాల్లో గొడవలు కొత్తేమీ కాదు. పల్లె బస్సుల్లో కన్నా.. గాల్లోనే ఎక్కువ ఫైటింగ్‌లు జరుగుతున్నాయి. ఈ మధ్య వెలుగులోకి వస్తున్న వీడియోలను బట్టి అర్ధమవుతోంది. ఇక కొట్లాటకు తామేమీ తక్కువ కాదనుకున్నారో ఏమో తెలియదు గానీ.. ఈసారి నారీమణులు తమ పంజా చూపించారు. నిశ్శబ్దంగా ఉండాలని ఒక ప్రయాణికుడు చెప్పడమే పాపం అయింది. అంతే ఒక మహిళ గుంపు.. మగ ప్రయాణికుడిపై మూకుమ్మడి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Jaggery: రాత్రిపూట బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో..!

కౌలాలంపూర్ నుంచి చైనాకు ఎయిర్ ఆసియా విమానం వెళ్తోంది. అయితే క్యాబిన్ లైట్లు ఆపిన తర్వాత కొంత మంది మహిళలు బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. సహచర మగ ప్రయాణికుడు అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో బిగ్గరగా మాట్లాడొద్దంటూ కోరాడు. అంతే ఆ మహిళలకు కోపం వచ్చేసింది. అతడితో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా ప్రయాణికుడ్ని చితకబాదారు. దీంతో విమాన సిబ్బంది, సహచర ప్రయాణికులు వచ్చి విడదీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: సెప్టెంబర్‌లో మోడీ అమెరికాలో పర్యటన! యూఎన్ సమ్మిట్‌కు హాజరయ్యే ఛాన్స్

విమాన సిబ్బంది వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది. లేదంటే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడేది. ఇక విమానం ల్యాండ్ అయ్యాక ఎటువంటి వైద్య సహాయం అవసరం రాలేదు. అంతేకాకుండా ఈ ఘటనలో ఎవర్నీ కూడా అరెస్ట్ చేయలేదు. అయితే ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో సిచువాన్ ప్రావిన్షియల్ పబ్లిక్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లోని ఎయిర్‌పోర్ట్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. విమాన ప్రయాణ సమయంలో ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా మర్యాదగా ఉండాలని అధికారులు సూచించారు.

Exit mobile version