NTV Telugu Site icon

FBI: “మీ ప్రాణాలు జాగ్రత్త”.. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తానీలకు ఎఫ్‌బీఐ వార్నింగ్

Khalistan, Nijjar Murder

Khalistan, Nijjar Murder

FBI warned US Khalistani elements: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. ఇప్పుడు ఈ హత్య కెనడా, ఇండియా మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తే , భారత్ కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది.

ఇదిలా ఉంటే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత పలువురు సిక్కు వేర్పాటువాదులు సైలెంట్ అయ్యారు. గురుపత్వంత్ సింగ్ పన్నూ లాంటి వారు కొన్ని నెలలుగా కనిపించలేదు. ఇదిలా ఉంటే ఈ హత్య తర్వాత కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అమెరికాలోని ఖలిస్తానీ వేర్పాటువాదులకు హెచ్చరికలు జారీ చేసిందని ది ఇంటర్‌సెప్ట్ ఓ నివేదికలో పేర్కొంది.

Read Also: Khalistan: దెబ్బ అదుర్స్.. 19 మంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఆస్తులు స్వాధీనం..

అమెరికాలోని పలువురు ఖలిస్తానీ వేర్పాటువాదుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఎఫ్బీఐ చెప్పింది. నిషేధత ఖలిస్తాన టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ నిజ్జర్ జూన్ 18న కాల్చి వేయబడ్డాడు. గురుద్వారాలో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత అమెరికన్ సిక్కు కాకస్ కమిటీ కోఆర్డినేటర్ ప్రీత్ పాల్ సింగ్ ది ఇంటర్‌సెప్ట్ తో మాట్లాడుతూ.. కాలిఫోర్నియాలోని మరో ఇద్దరు సిక్కు అమెరికన్లకు నిజ్జర్ హత్య తర్వాత ఎఫ్బీఐ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు.

జూన్ చివర్లో ఇద్దరు ఎఫ్బీఐ ప్రత్యేక ఏజెంట్లు నన్ను కలిశారని, నా ప్రాణాలకు ప్రమాదం ఉందని సమాచారం ఇచ్చారని ప్రీత్ పాల్ సింగ్ చెప్పారు. అయితే ఈ ముప్పు ఎక్కడి నుంచి వస్తుందో అని ప్రత్యేకంగా చెప్పలేదు కానీ, జాగ్రత్తగా ఉండాలని సూచించారని వెల్లడించారు.

నిజ్జర్ హత్యకు ముందే కెనడియన్ ఇంటెలిజెన్స్ అధికారులు జూన్ నెలలో ఖలిస్తానీ ఎలిమెంట్స్ ని హెచ్చరించినలట్లు బ్రిటీష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ ప్రతినిధి మోనీందర్ సింగ్ చెప్పారు. మా ప్రాణాలకు ప్రమాదం ఉందని మాత్రమే చెప్పారని, భారత ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందని వారు చెప్పలేదని, ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో అనే సమాచారం ఇవ్వలేదని మోనీందర్ సింగ్ వెల్లడించారు. రాయలో కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఏజెంట్లు నిజ్జర్ ను గుర్తించి అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Show comments