Site icon NTV Telugu

US: ఎఫ్‌బీఐ చీఫ్ రాజీనామా అంటూ పుకార్లు.. మౌనం వీడిన కాష్ పటేల్

Kashpateltrump

Kashpateltrump

ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ రాజీనామా చేశారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై దర్యాప్తును ముగించాలని న్యాయ శాఖ తీసుకున్న నిర్ణయంపై అంతర్గత ఉద్రిక్తతల నేపథ్యంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ రాజీనామా చేయబోతున్నట్లు పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే రాజీనామా వార్తలపై మిండెన్‌లో జరిగిన ర్యాలీలో కాష్ పటేల్ మౌనం వీడారు. రాజీనామా వార్తలను ఆయన తోసిపుచ్చారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో కొత్త విషయాలు ఏమీలేవని న్యాయశాఖ తేల్చింది. ఈ నేపథ్యంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. కుట్ర సిద్ధాంతాలు నిజం కావని.. ఎప్పుడూ నిజం కావని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికి సేవ చేయడం గౌరవంగా ఉందని.. ట్రంప్ పిలిచేంత వరకు ఆ పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Chiranjeevi : అనిల్ రావిపూడి సినిమాలో మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ రోల్..!

ఎప్‌స్టీన్‌ ఫైల్స్ అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, ఫ్లైట్‌ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌ డాన్‌ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్‌ పటేల్‌ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్‌ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని మీడియా కథనాలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను ఖండించారు. తాను రాజీనామా చేయడం లేదని కాష్ పటేల్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Operation Baam: బలూచిస్తాన్ ఎప్పటికీ పాకిస్తాన్‌లో భాగం కాదు.. పాక్ కు హెచ్చరిక

 

జెఫ్రీ ఎప్‌స్టీన్‌.. మైనర్లపై లైంగిక నేరాలకు సంబంధించిన ఆరోపణలతో అరెస్టు అయిన ఒక అమెరికన్ వ్యాపారవేత్త. అతను 2019లో జైల్లో మరణించాడు. అతని మరణం తర్వాత కేసు, దాని పరిణామాలపై దర్యాప్తులు జరిగాయి. ఈ దర్యాప్తుల్లో ఎప్‌స్టీన్‌ నేరాల యొక్క పరిధి.. జైలులో ఎలా మరణించాడనే దానిపై ప్రశ్నలు, కేసులో పాల్గొన్న ఇతర వ్యక్తులపై ఆరోపణలను పరిశోధించారు. ఎప్‌స్టీన్‌ మరణం ఆత్మహత్య అని వైద్య నివేదికలు కూడా నిర్ధారించాయి. కానీ అతని కుటుంబం మాత్రం హత్య చేశారని ఆరోపించింది. ఇక ఎఫ్‌బీఐ, న్యాయశాఖ దర్యాప్తులు కూడా ఆత్మహత్య అని నిర్ధారించాయి. తాజాగా ఈ కేసులో ఏమీలేదని దర్యాప్తును కూడా ముగించేశాయి.

Exit mobile version