Site icon NTV Telugu

Taliban: ‘‘నువ్వు మగాడివైతే, నీ తల్లి పాలు తాగితే’’.. పాక్ ఆర్మీ చీఫ్‌కు తాలిబాన్ హెచ్చరిక..

Asim Munir

Asim Munir

Taliban: తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడులు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను ఉద్దేశించి తాలిబాన్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో మునీర్‌కు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ సైన్యం తన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టకుండా, బదులుగా ఉన్నత సైనికాధికారులే స్వయంగా యుద్ధరంగానికి రావాలని టీటీపీ అగ్ర కమాండర్ మునీర్‌ని బెదిరిస్తూ వీడియోలో హెచ్చరించారు.

Read Also: PM Modi: రేపటి నుంచే బీహార్‌లో మోడీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ నుంచంటే..!

అక్టోబర్ 8న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని కుర్రం ఏజెన్సీలో జరిగిన ఆకస్మిక దాడిలోకి సంబంధించిన ఘర్షణకు సంబంధించిన వీడియోను టీటీపీ షేర్ చేసింది. ఇందులో 22 మంది పాక్ సైనికులు మరణించారని పేర్కొంది. తాలిబాన్లు పాక్ ఆర్మీ నుంచి స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రి, వాహనాలకు సంబంధించిన ఫుటేజీ వీడియోలో కనిపిస్తుంది. అయితే, పాక్ ఆర్మీ మాత్రం తమ సైనికులు 11 మంది చనిపోయినట్లు అంగీకరించింది. ఇక వీడియోలో టీటీపీ కమాండర్ కాజిమ్.. ‘‘నువ్వు మగాడివైతే మమ్మల్ని ఎదుర్కో, నువ్వు నీ తల్లి పాలు తాగితే మాతో పోరాడు’’ అని అసిమ్ మునీర్‌ను హెచ్చరించాడు. కాజిమ్ జాడ చెబితే 10 కోట్ల పాకిస్తానీ రూపాయాలు ఇస్తామని ఇటీవల పాక్ ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version