UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- పాకిస్తానీ ఉద్యోగుల్ని తొలగించిన ఎతిహాద్..
- 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని యూఏఈ ఆదేశం..
- పాక్-యూఏఈల మధ్య చెడిన సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), పాకిస్తాన్ మధ్య విభేదాలు ముదుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎతిహాద్ ఎయిర్‌వేస్ తన సంస్థలో పనిచేస్తున్న 18 మంది పాకిస్తానీ ఉద్యోగుల్ని తీసేసింది. ఇదే కాకుండా ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం సంచలనంగా మారింది. ఉద్యోగం కోల్పోయినవారిలో ఒకరు ఆ సంస్థలో 18 ఏళ్లుగా పనిచేస్తుండటం గమనార్హం. వీరిని ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత, ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద రిపోర్ట్ చేయమని చెప్పడం కొసమెరుపు. సాధారణంగా ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ, ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు రిపోర్టు ఎందుకు చేయమంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిని బట్టి చూస్తే కావాలనే యూఏఈ పాకిస్తాన్ వ్యక్తుల్ని టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది.
Read Also: Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్‌లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్‌కు పాక్ మంత్రి వార్నింగ్!
- Indian Army: అరుణాచల్‌లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
ఎలాంటి నోటీసులు లేకుండా రెండు రోజుల్లో పాకిస్తాన్ తిరిగి వెళ్లాలని ఆదేశించడంతో, ఇంత తక్కువ వ్యవధిలో వెళ్లిపోవడం కష్టంగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఆ దేశ ప్రజలు యూఏఈ నుంచి పంపించే డబ్బులు చాలా కీలకం. ఇదే కాకుండా చాలా మంది పాకిస్తానీలు యూఏఈలో ఉపాధి పొందుతారు. ఈ నేపథ్యంలో ఇలా ఉద్యోగాలను తీసేసయడం పాకిస్తాన్‌కు భారీ దెబ్బగా చెబుతున్నారు.
ఈ తొలగింపులపై ఇప్పటి వరకు ఎతిహాద్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇటీవల, ఇరాన్ పరిణామాలు, సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఒప్పందం యూఏఈకి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల యూఏఈ తనకు పాకిస్తాన్ నుంచి రావాల్సిన 3 బిలియన్ డాలర్లను వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఇరాన్ తమపై దాడులు చేస్తున్నా సౌదీ, పాకిస్తాన్‌లు కనీసం ఖండించలేదనే ఆగ్రహం యూఏఈలో ఉంది.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
-
Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!