Ethiopia: ఇథియోపియాలో ఘోర బస్సు ప్రమాదం.. 31 మంది మృతి
- ఇథియోపియాలో ఘోర బస్సు ప్రమాదం
- 31 మంది మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర అంహారా ప్రాంతంలో ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. డెస్సీ ప్రాంతం నుంచి రాజధాని అడిస్ అబాబాకు వెళ్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. మార్గమధ్యంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రహదారి నుంచి పక్కకు దూసుకెళ్లి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సరైన మౌలిక వసతులు, అంబులెన్స్ సేవలు లేకపోవడం వల్ల సహాయక చర్యలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గాయపడిన వారిలో పలువురు సమయానికి వైద్యం అందక మృతి చెందినట్లు సమాచారం. బాధితులను ప్రజా రవాణా వాహనాల్లో సమీప ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చింది.
Also Read
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ప్రమాదం జరిగిన రహదారి కొండ ప్రాంతాల గుండా సాగుతూ ప్రమాదకర మలుపులతో ఉండటంతో ఇప్పటికే ప్రమాదాలకు కేరాఫ్‌గా గుర్తింపు పొందింది. అయితే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో 2024 డిసెంబర్లో ఇథియోపియాలోని దక్షిణ సిడామా ప్రాంతంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఓ బస్సు నదిలో పడిపోవడంతో 66 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!