Site icon NTV Telugu

Erika Kirk: జేడీ వాన్స్‌ను అందుకే కౌగిలించుకున్నా.. ఎరికా కిర్క్ క్లారిటీ

Erika Kirk

Erika Kirk

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఎరికా కిర్క్ కౌగిలింత ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా చక్కర్లు కొట్టింది. అంతేకాకుండా పెను దుమారం కూడా రేపింది. ఒక్క ఫొటో.. వంద ప్రశ్నలు తలెత్తాయి. సోషల్ మీడియా వేదికగా రకరకాలైన కథనాలు వెల్లువడ్డాయి.

ఇది కూడా చదవండి: Trump-Jinping: ట్రంప్-జిన్‌పింగ్‌ మధ్య కీలక సంభాషణ.. ఏప్రిల్‌లో చైనాలో పర్యటన

తాజాగా వ్యాఖ్యాత మేగిన్ కెల్లీతో జరిగిన సంభాషణలో కౌంగిలింతపై ఎరికా కిర్క్ ఓపెన్ అయ్యారు. ఆరోజు జేడీ వాన్స్‌ను ఎందుకు కౌగిలించుకోవాల్సి వచ్చిందో స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 29న మిస్సిస్సిప్పిలో జరిగిన టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమంలో వేదికపైకి వస్తుండగా అప్పుడే భావోద్వేగ వీడియో ప్లే అయింది. దీంతో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసిందని.. వేదికపై అలా ఏడుస్తూనే ఉన్నట్లు చెప్పింది. ఆ సమయంలో జేడీ వాన్స్ తనను చూసి ‘‘నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను.’’ అని చెప్పారని.. అప్పుడు జేడీ వాన్స్‌ను కౌగిలించుకుని ‘‘దేవుడు నిన్ను దీవించు గాక’’ అంటూ తల వెనుక చేయి వేసి దీవించినట్లు చెప్పుకొచ్చారు. తాను ఎవరినైనా కౌగిలించుకుంటే చెప్పే మాట అదేనని క్లారిటీ ఇచ్చారు. ‘‘నువ్వు ఎప్పుడైనా నన్ను కౌగిలించుకుంటే.. నేను అలాగే చేశాను.’’ అంటూ వ్యాఖ్యాత మేగిన్ కెల్లీతో ఎరికా కిర్క్ చెప్పుకొచ్చారు. అయినా ఆ క్షణంలో అదొక ప్రేమ భాష అని.. అదొక భావోద్వేగ క్షణమే తప్ప అందులో ఏమి లేదని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Mumbai airport: ప్రపంచ రికార్డ్ సృష్టించిన ముంబై ఎయిర్‌పోర్ట్.. దేంట్లో అంటే..!

చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు. టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు. అయితే ఇటీవల ఉతా వ్యాలీ యూనివర్సిటీలో కార్యక్రమం నిర్వహిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ చనిపోయారు. ఈ ఘటన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఇక భర్త మరణం తర్వాత టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమాన్ని భార్య ఎరికా కిర్క్ చేపట్టారు. ఇందులో భాగంగా గత అక్టోబర్‌ 29న జరిగిన కార్యక్రమానికి జేడీ వాన్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై జేడీ వాన్స్-ఎరికా కిర్క్ గట్టిగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య ఉషా వాన్స్ హిందువు అని.. ఏదొక రోజు క్రైస్తవ్యంలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీంతో జేడీ వాన్స్-ఉషా వాన్స్ సంసారంలో ఏదో జరుగుతుందని పుకార్లు నడిచాయి. అలాగే ఇటీవల ఉషా వాన్స్ కూడా పెళ్లి ఉంగరం లేకుండా కనిపించడంతో వదంతులకు బలం చేకూర్చింది. కానీ అధికారికంగా ఇప్పటి వరకు ఉషా వాన్స్ ఎక్కడా స్పందించలేదు. ఇక తాజాగా కౌగిలింతపై ఎరికా కిర్క్ క్లారిటీ ఇచ్చేశారు. ఇకనైనా రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

 

Exit mobile version