NTV Telugu Site icon

Twitter: ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామా.. “నేనేం వర్రీ కావడం లేదంటున్న” మస్క్..

Twitter Elon Musk

Twitter Elon Musk

Elon Musk’s tweet on employee resignation: ట్విట్టర్ లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ ని టేకోవర్ చేసుకున్న తరువాత కొత్త బాస్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. ఇదే విధంగా కంపెనీ కోసం “హార్డ్‌కోర్”గా కష్టపడేవారు, పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేయాలంటూ ఉద్యోగులకు సూచించాడు మస్క్. లేకపోతే ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లవచ్చని సూచిస్తూ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించారు. అయితే ఎలాన్ మస్క్ వార్నింగ్ తో ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేస్తున్నారు. గురువారం వందలాది మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు.

Read Also: UN: పాకిస్తాన్ బుద్ధి వంకర.. స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చిన భారత్..

ఉద్యోగుల రాజీనామా గందరగోళ పరిస్థితుల్లో ట్విట్టర్ సోమవారం వరకు తన కార్యాలయాలను మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ తన చేతిలోకి తీసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ వర్క్ ఫ్రం హోమ్ రద్దు చేశాడు. దీంతో పాటు ఫ్రీ పుడ్ తీసేశాడు, వర్క్-ఫ్రమ్-హోమ్ పాలసీకి అనేక మార్పులు చేశాడు.

ఇదిలా ఉంటే ఉద్యోగుల ముకుమ్మడి రాజీనామాలపై ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. వందలాది మంది రాజీనామాలు చేస్తున్న సందర్భంలో కీలక ట్వీట్ చేశాడు. ‘‘నేనేం ఆందోళన చెందడం లేదని.. అత్యుత్తమ వ్యక్తులు మాత్రమే ఉంటారని’’ ట్వీట్ చేశారు. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ని సొంతం చేసుకున్నాడు ఎలాన్ మస్క్. వచ్చీ రావడంతో నలుగురు కీలక ఉద్యోగులను తొలగించాడు. దీంతో పాటు బోర్డును రద్దు చేస్తూ.. తనే ఏకైక డైరెక్టర్ గా ఉన్నాడు. దీంతో పాటు ట్విట్టర్ బ్లూ టిక్ ,వెరిఫైడ్ ఖాతాల వారు నెలకు 8 డాలర్లు(ఇండియాలో రూ.719) చెల్లించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీలోని 7,500 మంది సిబ్బందిలో సగం మందిని తొలగించాడు. రానున్న రోజుల్లో మరెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.