NTV Telugu Site icon

Elon Musk: మస్క్ సరికొత్త విన్యాసం.. వీడియో వైరల్

Musk

Musk

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలోన్ మస్క్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మస్క్ తన వేలికొనపై రెండు స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. రెండు చెంచాలు కూడా పడకుండా బ్యాలెన్స్‌ చేస్తూ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రక్కనే ఉన్నారు.

ఇది కూడా చదవండి: Kunal Kamra: కమెడియన్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్

ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక మైన డిన్నర్‌లో అతిథులంతా కూర్చుని ఉన్నారు. మస్క్ తన భార్యతో కలిసి డిన్నర్‌లో పాల్గొ్న్నారు. అయితే తన సీటులో కూర్చుని ఉండగా వేలికొనపై ఫోర్క్, రెండు స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ కనిపించారు. చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. అటూ.. ఇటూ చూపిస్తూ ఏ మాత్రం పడకుండా బ్యాలెన్స్ చేస్తూ మస్క్ కనిపించారు. దీంతో చుట్టూ ఉన్నవారంతా మస్క్‌ను అభినందిస్తూ కనిపించారు. ఆ ప్రక్కనే ట్రంప్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మస్క్ సోషల్ మీడియాలో పంచుకోగా.. వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Sonal Chauhan : బీచ్ లో సోనాల్ చౌహన్ సొగసులు చూసి తీరాల్సిందే

ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఎవరూ చేయలేని సాహసం చేశారంటూ వెటకారంతో కూడిన కామెంట్లు చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యానాలు చేశారు.