Site icon NTV Telugu

Trump-Musk: ట్రంప్-మస్క్ మధ్య పెరుగుతున్న దూరం.. ట్యాక్స్ బిల్లుపై పోరాటం చేయాలని పిలుపు

Musk

Musk

అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ట్రంప్ పరిపాలన నిర్ణయాలను మస్క్ ఎండగడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది చాలా అసహ్యమైనది అని.. దీంతో అమెరికా దివాళా తీయడం ఖాయమని మస్క్ హెచ్చరించారు. అంతేకాకుండా పన్ను బిల్లుకు ఆమోదముద్ర వేసి అమెరికన్‌ ప్రజలకు ద్రోహం చేసిన రాజకీయ నాయకులందరినీ వచ్చే ఏడాది నవంబరు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు మట్టికరిపించనున్నారని మస్క్‌ వార్నింగ్ ఇచ్చారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం బిల్లును సమర్థించింది. ఈ చట్టం ‘‘అపూర్వమైన ఆర్థిక వృద్ధి యుగాన్ని ఆవిష్కరిస్తుంది’’ అని పేర్కొంది.

ఇది కూడా చదవండి: World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ఎప్పుడు మొదలైందో తెలుసా?

తాజాగా మస్క్ మరొక ట్వీట్ చేశారు. ట్రంప్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుపై అమెరికన్లు చర్య తీసుకోవాలని కోరారు. ‘‘మీ సెనేటర్‌కి కాల్ చేయండి.. లేదంటే మీ కాంగ్రెస్ సభ్యుడికి కాల్ చేయండి.’’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘‘ అమెరికా దివాలా తీయడం సరికాదు’’ అని మస్క్ రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Sanjana Varada: ఢిల్లీలో మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీలు.. ఏపీ నుంచి ఫైనలిస్టు ఎంపిక..

ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ట్యాక్ బిల్లు.. విద్యుత్‌ వాహనాలకు, హరిత ఇంధనాలకూ నిధులను తగ్గించేస్తుంది. ఇది అమెరికాలో అతిపెద్ద విద్యుత్‌ వాహన ఉత్పత్తిదారైన టెస్లా కంపెనీకీ, దాని యజమాని మస్క్‌కు తీరని నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే 36 లక్షల కోట్ల డాలర్లకు చేరిన అమెరికా ప్రభుత్వ రుణభారాన్ని తగ్గించడానికి ఈ బిల్లు పేదల ఆరోగ్య బీమా మెడికెయిడ్‌కూ, ఆహార టోకెన్లకూ కోత పెడుతోంది. అయితే బిల్లుపై మస్క్ పోరాడినట్లు తెలుస్తోంది. ట్రంప్ సర్కార్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినా.. చివరికి విఫలం కావడంతో మస్క్ ఈ విధమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version