NTV Telugu Site icon

Elon Musk: ప్రపంచ కుబేరుడు.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు..

Elon Musk

Elon Musk

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. అంటే.. జీవితంలో ఈ రెండింటికి ఎంతో ప్రాధాన్యతతో పాటు.. ఖర్చుతో కూడుకున్న పనికూడా అని వారి ఉద్దేశం.. జీవితంలో సెటిల్‌ అయ్యారా? అనేదానికి ఏం చేస్తున్నారు..? ఎంత సంపాదిస్తున్నారు..? సొంత ఇల్లు ఉందా? అనే ప్రశ్నలు కూడా ఎదురవుతుంటాయి.. చాలా మంది కాస్త సంపాదిస్తే.. అప్పో.. సప్పో చేసి.. ప్రస్తుతం లోన్‌ పెట్టుకొని అయినా.. సొంత ఇంటి కల నెరవేర్చుకుంటున్నారు. వేతన జీవులు కూడా సాహసం చేసి మరి ఇళ్లు కొంటున్నారు.. కానీ, ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన ఎలన్‌ మస్క్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి… తన సంపదతో ఏదైనా ఇట్టే సొంత చేసుకోగలిగే స్థానంలో ఉన్న ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేకపోవడం సంచలనంగా మారిందనే చెప్పాలి.

Read Also: KTR: కేంద్రంపై కేటీఆర్‌ సెటైర్లు.. అన్నీ పైపైకే..!

ఇక, ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఎలన్‌ మస్క్‌ సంపద 250 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది.. అంటే రూ.19,06,730 కోట్లకు పైమాటే.. కానీ, ఇప్పటికీ ఆయనకు సొంతిళ్లు లేదని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఇప్పటి వరకు నాకు సొంత ప్లేస్ అంటూ ఏదీ లేదు.. నేను ఇప్పటికీ నా స్నేహితుల ఇళ్లల్లో ఉంటున్నాను.. అంటూ ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టేశారు ఈ టెస్లా బాస్.. ఒకవేళ బిజినెస్‌ పనిమీద ఇతర ప్రదేశాలకు వెళ్తే.. స్నేహితుల ఇళ్లలో ఉండే అదనపు బెడ్‌రూమ్‌లలోనే ఉంటానని పేర్కొన్నాడు.. మరోవైపు, తన వ్యక్తిగత అవసరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే అది చాలా సమస్యాత్మకం అవ్వొచ్చని అభిప్రాయపడ్డ ఆయన.. తన కేసులో అలా జరగదని స్పష్టం చేశారు.. ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం తనకు సొంత నౌక కూడా లేదని తెలిపారు. కానీ, తనకు ఒక విమానం ఉందని, దానిని కూడా ఎక్కువగా వాడనని చెప్పుకొచ్చారు.. తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ఏ అవకాశాన్ని వదలకుండా పెట్టుబడులు పెడుతూ వచ్చే ఎలన్‌ మస్క్.. ఎన్నో కార్లు, బంగ్లాలు, సొంత విమానాలు కూడా ఉంటాయని అనుకుంటాం.. కానీ, ఇప్పటికే తనకు సొంతిళ్లు లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎలన్ మస్క్.