Elon Musk vs Mark Zuckerberg: ఆలూ లేదు చూలూ లేదు.. అంతా ఉత్తుత్తే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk vs Mark Zuckerberg: ఎలాన్ మస్క్ vs మార్క్ జుకర్‌బర్గ్.. ఈ ఫైట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా? అని విశ్వవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తుంటే, తాజాగా ఎలాన్ మస్క్ ఎవ్వరూ ఊహించని బాంబ్ పేల్చాడు. తమ మధ్య ఫైట్ అనేది ఉత్తుత్తేనంటూ ‘X’ బాస్ కుండబద్దలు కొట్టాడు. తాను ఫైట్ గురించి జుకర్‌బర్గ్‌తో జోక్ చేశానని.. ఫైట్ ప్రస్తావన రాగానే లొకేషన్ పంపమంటూ తనకు జుకర్‌బర్గ్ నుంచి సమాధానం వచ్చిందని తెలిపాడు. తొలుత తమపోటీ కోసం వేదిక ఇచ్చేందుకు ఇటలీ ముందుకొస్తే.. జుకర్‌బర్గ్ దాన్ని తిరస్కరించానన్నాడు. అప్పుడు ఫైట్ కోసం జుకర్‌బర్గ్ ఇంటినే తాను సూచించానని.. అయితే ఆయన ఇంట్లో లేరంటూ పేర్కొన్నాడు. అసలు జుకర్‌బర్గ్‌కి పోరాడే ఉద్దేశం ఉందా? అంటూ తన X ఖాతాలో ఎలాన్ మస్క్ రాసుకొచ్చారు. దీంతో.. వీరి మధ్య ఫైట్ ఉండదని తేలిపోయింది.
Eye Flu: కండ్లకలక వస్తే సింపుల్ హోం రెమిడీ.. వెంటనే ఉపశమనం
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
కాగా.. రాజకీయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మస్క్, మార్క్ పరస్పరం విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ‘X’కి పోటీగా థ్రెడ్స్‌ని తీసుకురావడంతో.. తన Xని కాపీ కొట్టి థ్రెడ్స్‌ని తయారు చేశారని మస్క్ ఆరోపించారు. అంతేకాదు.. X నుంచి తొలగించబడిన ఉద్యోగుల్ని చేర్చుకొని, వారి చేతే థ్రెడ్స్ డిజైన్ చేయించారని మస్క్ పేర్కొన్నాడు. అయితే.. మస్క్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తాము X ఉద్యోగుల్ని తీసుకోలేదని మార్క్ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మార్క్‌తో కేజ్ ఫైట్‌కి సిద్ధమని మస్క్ సవాల్ చేశాడు. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. మస్క్ సవాల్‌ని మార్క్ స్వీకరిస్తూ తాను ఫైట్‌కి రెడీ అంటూ బదులిచ్చాడు. మొదట్లో ఇదంతా కేవలం తమతమ ప్లాట్‌ఫార్మ్స్‌ని ప్రచారం చేసుకోవడం కోసమే ఈ జిమ్మిక్కులకి దిగారని అంతా అనుకున్నారు. కానీ.. వీళ్లిద్దరు ట్రైనింగ్ సెషన్లో పాల్గొనడం, ఫైటింగ్ దృశ్యాల్ని కూడా పోస్ట్ చేయడంతో.. తప్పకుండా వీరి మధ్య ఫైట్ ఉంటుందని భావించారు. కానీ.. ఇదంతా జోక్ అంటూ ఎలాన్ మస్క్ తాజాగా తేల్చేశాడు.
తాజావార్తలు
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!