Elon Musk Plans to Cut Half of Twitter Jobs to Slash Costs: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. గత వారం 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నారు. వచ్చీ రావడంతోనే సంస్థలో పనిచేస్తున్న నలుగురు కీలక ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను రద్దు చేసి.. తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వెరిఫైడ్ అకౌంట్స్, బ్లూ టిక్ ఉన్న వారిని నుంచి ప్రతీ నెల 8 డాలర్లు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు వారికి మరిన్ని ఫీచర్లు అందిస్తామని వెల్లడించు.
Read Also: Twitter: సగం మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఎలాన్ మస్క్.
ఇదిలా ఉంటే ట్విట్టర్ నుంచి సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే ఆలోచనను ఎలాన్ మస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్చును తగ్గించుకునే పనిలో భాగంగానే ఈ చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది. సంస్థలో 3,700 ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన టెస్లా, న్యూరాలింక్ కంపెనీల్లో పని చేస్తున్న, నమ్మకమైన ఉద్యోగులను ట్విట్టర్ లోకి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులు వర్క్ ఫ్రం ఎనీవేర్ అనే విధానాన్ని తీసేసి, ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
ట్విట్టర్ టేకోవర్ చేసిన వెంటనే సీఈఓ పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్, లీగల్ స్టాప్ విజయ గద్దె, సీన్ ఎడ్జెట్ వంటి వారిని బాధ్యతల నుంచి తొలగించారు. వీరితో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ లో ఉన్న పలువురికి కూడా ఉద్వాసన పలికారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను 50 శాతానికి తగ్గించే పనిలో ఉన్నారు మస్క్. మరోవైపు బ్లూ టిక్ ఉన్నవారి నుంచి నెలకు 8 డాలర్లను వసూలు చేస్తామని మస్క్ చెప్పిన తర్వాత.. ప్రపంచ వ్యాప్తంగా అనేక మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.