Giorgia Meloni: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని నార్వే, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రియాక్ట్ అయ్యారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై మండిపడుతున్నాయన్నారు. పలు సందర్భాల్లో ఇటలీ, ఇతర దేశాధినేతలు తమ దేశ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారని తెలిపింది. ఇక, మస్క్ తన భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నారు.. యూఎస్ లో బిలియనీర్ జార్జ్ సోరోస్ లాంటి లెఫ్ట్‌వింగ్ సపోర్టుదారులే రాజకీయ జోక్యానికి పాల్పడ్డారని జార్జియా మెలోని విమర్శలు గుప్పించారు.
Read Also: Pawan Kalyan: గ్రామాల పర్యటనకు పవన్ కళ్యాణ్.. కార్యాచరణ సిద్ధం!
కాగా, ఇటీవల ఎలాన్ మస్క్ ఇతర దేశాల రాజకీయాలపై చేస్తున్న కామెంట్స్ తో అక్కడి పరిస్థితులను ప్రభావితం చేస్తుందనే ఆరోపణలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తప్పుబట్టారు. సంపన్నులు తమ దగ్గరున్న వనరులను వరల్డ్ లో ఉన్న పార్టీలు, సంఘాలు, రాజకీయ ప్రతినిధులకు విరాళంగా ఇస్తే.. అక్కడి పరిస్థితులను ప్రభావితం అవుతాయి.. జార్జ్ సోరోస్ ఈ విధంగా వ్యవహరిస్తారని ఆమె ఆరోపించారు. కానీ మస్క్ అలా చేయడం లేదు.. వివిధ దేశాలలోని పలు పార్టీలకు ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పారు. ఇది కామన్ విషయం అన్నారు. కొన్ని దేశాల అధినేతలు సోరోస్ నుంచి డబ్బులు తీసుకొని.. అతడికి మద్దతుగా పని చేస్తున్నారు. కానీ, తాము మస్క్ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోలేదన్నారు. మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌తో తమ సర్కార్ వివాదాస్పద సైబర్ సెక్యూరిటీ డీల్‌పై సంతకం చేయబోతున్నట్లు వచ్చిన మీడియా కథనాలను జార్జియా మెలోని తీవ్రంగా ఖండించారు.