NTV Telugu Site icon

Britain PM vs Elon Musk: బ్రిటన్‌ ప్రధానిపై ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు.. కీర్‌ స్టార్మర్‌ కౌంటర్..

Britan

Britan

Britain PM vs Elon Musk: బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌పై అమెరికా బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ విమర్శలకు బ్రిటన్‌ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది. పాకిస్థాన్ మూలాలున్న వ్యక్తులు అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లను నడిపినా అప్పట్లో క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ అధినేతగా ఉన్న స్టార్మర్‌ పట్టించుకోలేదని మస్క్‌ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చేసిన ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. ఇక, అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగులను చట్టం ముందు దోషులుగా నిలపడంలో స్టార్మర్‌ గతంలో ఫెయిల్ అయ్యాడని ఆరోపణలు చేశారు.

Read Also: Explosion At Factory In Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి!

ఇందుకే బ్రిటన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో కీర్ స్టార్మర్‌కు కూడా భాగస్వామ్యం ఉందని ఎలా మస్క్‌ సంచలన ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఆ గ్యాంగులపై విచారణకు లేబర్‌ పార్టీ ఒప్పుకోకపోవడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఎలాన్ మస్క్‌ చేసిన ఈ విమర్శలపై బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. మస్క్‌కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, ఆయన ఆరోపణలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, బ్రిటన్‌లో అమ్మాయిలపై కొనసాగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు తాము ఎలాన్ మస్క్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెస్‌ వెల్లడించారు.

Show comments