Elon Musk Is Now The World’s Second Richest Man. New No. 1 Is Bernard Arnaul: ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ గత జనవరి నుంచి క్రమంగా తన సంపదను కోల్పోతూ వస్తున్నాడు. దాదాపుగా అతని సంపదలో 100 బిలియన్ డాలర్లను కోల్పోయాడు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్నాళ్లు ప్రపంచ నెంబర్ 1 ధనవంతుడిగా ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 1 ధనవంతుడిగా బెర్నాల్డ్ ఆర్నాల్ట్ నిలిచాడు. ప్రస్తుతం ఆర్నాల్ట్ సంపద విలువ 172.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒకప్పుడు ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ 340 బిలియన్ డాలర్లుగా ఉండేది.
Read Also: Acid Attack: 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి.. ఢిల్లీలో ఘటన
ఫ్యాషన్ దిగ్గజం, బ్రాండెడ్ వస్తువులకు కేరాఫ్ గా ఉన్నారు బెర్నాల్డ్ ఆర్నాల్ట్. ఎల్వీఎంహెచ్ కంపెనీకి చైర్మన్ గా ఉన్నారు ఆర్నాల్ట్. ఇదిలా ఉంటే ట్విట్టర్ డీల్ తర్వాత నుంచి క్రమంగా ఎలాన్ మస్క్ తన ఆస్తులను కోల్పోతూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇలాగే ప్రపంచ కుబేరుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. తరువాత కొంత సమయానికే మొదటి ప్లేసుకు చేరుకున్నారు. తాజాగా మరోసారి రెండో స్థానానికి పడిపోయాడు ఎలాన్ మస్క్.
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ అయిన ఎలాన్ మస్క్ 40 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ కొనుగోలు కోసం 19 బిలియన్ డాలర్ల షేర్లను ఏప్రిల్, ఆగస్టు నెలల్లో విక్రయించారు. ఇటీవల కాలంలో అమెరికా వడ్డీ రేట్లను పెంచడంతో మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, లారీ పేజ్ ,సెర్గీ బ్రిన్ వంటి బిలియనీర్ల ఆస్తులు తగ్గిపోయాయి. దీంతో బెర్నాల్డ్ ఆర్నాల్ట్ తొలిస్థానంలో నిలిచారు. 73 ఏళ్ల ఆర్నాల్ట్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత స్థిరాస్తి రంగంలో ఆ తరువాత ఎల్వీఎంహెచ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తదనంతరం కాలంలో ఆ కంపెనీని సొంతం చేసుకున్నారు. అత్యంత ఖరీదైన బ్రాండ్లు ఈ కంపెనీ చేతిలోనే ఉన్నాయి.
