NTV Telugu Site icon

Trump-Musk: మస్క్‌ అమెరికా అధ్యక్షుడు అవుతారా?.. ట్రంప్ ఆసక్తికరమైన సమాధానం..!

Trump

Trump

Trump-Musk: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్న రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే, ట్రంప్‌ తీసుకునే నిర్ణయాల్లోనూ టెస్లా చీఫ్ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. దీంతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు అవుతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి డొనాల్డ్ ట్రంప్‌ స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశారు. మస్క్ ప్రెసిడెంట్‌ కాలేరని చెప్పుకొచ్చారు.

Read Also: UI Movie : రోజు రోజుకు బుకింగ్స్ పెంచుకుంటూ అదరగొడుతున్న ఉపేంద్ర ‘యూఐ’

అయితే, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి ఆరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్‌ కాన్ఫరెన్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అధ్యక్షుడు మస్క్‌’ అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై ఆయన రియాక్ట్ అయ్యారు. మస్క్‌ యూఎస్ అధ్యక్షుడు కాలేరని చెప్తున్నాను.. ఎందుకో తెలుసా? ఆయన ఈ దేశంలో జన్మించలేదని పేర్కొన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల చీఫ్ అయిన ఎలాన్ మస్క్‌.. దక్షిణాఫ్రికాలో పుట్టారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవి చేపట్టబోయే వ్యక్తి ఇక్కడ జన్మించిన పౌరుడై ఉండాలని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Show comments