అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. గత కొంత కాలంగా ట్రంప్ ప్రభుత్వంపై మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ట్యాక్స్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన మస్క్.. తాజాగా ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: AP DSC: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో మస్క్ పోస్ట్ చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు. భవిష్యత్తులో నిజానిజాలు బయటపడతాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: జనం ప్రాణాలు అన్నింటికన్నా ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు!
ఎప్‌స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడికి క్లింటన్, ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మిషెల్ బ్లూమ్‌బెర్గ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోర్టు పత్రాల్లో వెల్లడైంది. ఈ క్రమంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయటపెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు. అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ప్రభుత్వంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో ట్రంప్-మస్క్ ఎంతో అన్యోన్యంగా మెలిగారు. అయితే ట్రంప్ నిర్ణయాలు నచ్చకపోవడంతో మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ట్రంప్ గ్రాప్ మసకబారుతోంది.
తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు గెలిచేవారా? వారంతా ఓడిపోయేవారని మస్క్ వ్యాఖ్యానించారు. సెనెట్‌లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారని మస్క్ గుర్తుచేశారు. ఇక ట్రంప్ స్పందిస్తూ.. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని.. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని ట్రంప్ అన్నారు. మొత్తానికి ట్రంప్ ప్రభుత్వానికి మస్క్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.
https://twitter.com/elonmusk/status/1930703865801810022
