Earth would have been more habitable if Jupiter’s orbit had changed: సౌరకుటుంబం చాలా విలక్షణమైంది. ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు సౌరకుటుంబం మాత్రమే భూమిలాంటి నివాసయోగ్యంగా ఉండే గ్రహాన్ని కలిగి ఉంది. మన సౌరవ్యవస్థ నుంచి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం పరిశోధనలు జరిపినా.. భూమిలాంటి నివాసయోగ్యంగా ఉన్న గ్రహం కనిపించలేదు. ఎక్సో ప్లానెట్స్ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే కొన్ని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పరిశీలించినప్పటికీ.. ఇవి భూమి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ.. పూర్తిగా భూమిని పోలిన విధంగా.. ఆవాసానికి పనికి వచ్చే విధంగా లేవు.
భూమి సూర్యుడి నుంచి హాబిటేబుల్ జోన్ లో ఉంది. అంటే జీవాల అవాసానికి అనుగుణంగా ఉష్ణోగ్రత ఉండే విధంగా ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం ఒక వేళ గురుడి కక్ష్యలో గానీ మార్పులు ఉంటుంటే భూమి జీవాల నివాసానికి మరింతగా ఆతిథ్యమిచ్చే అవకాశం ఉండేదని పరిశోధన తెలిపింది.
Read Also: Neha Sharma: అందాల ఆరబోయాలంటే ‘చిరుత’ పిల్ల తరువాతే ఎవరైనా..
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-రివర్ సైడ్ లోని శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ సౌర వ్యవస్థను సృష్టించారు. దీంట్లో భూమితో పాటు ఇతర గ్రహాల కక్ష్యలను మార్చారు. సౌరవ్యవస్థలోనే భారీ గ్రహం బృహస్పతి కక్ష్యలో భారీగా మార్పులు చోటు చేసుకుంటే అది భూమి కక్ష్యను కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధనల్లో తేలింది. అయితే ప్రస్తుతం గురుడు ఉన్న చోటునే ఉండి… దాని కక్ష్య ఆకృతి మారితే మరింతగా భూమి నివాసయోగ్యతను కలిగి ఉండేదని పరిశోధకులు తేల్చారు.
సౌరకుటుంబం మొదటి నుంచి భూమిపై గురుగ్రహం ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. చాలా వరకు భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలాలను తన వైపు లాక్కుంటుంది. మార్స్ తర్వాత ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోని చాలా గ్రహశకలాలను గురుగ్రహం తన గురుత్వాకర్షన శక్తితో నియంత్రించడం వల్ల భూమి సేఫ్ గా ఉంటుంది. రానున్న రోజుల్లో గురుగ్రహం భూమిని ఎలా ప్రభావితం చేయగలదో అర్థం చేసుకునే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. అనంత విశ్వంలో ఇప్పటి వరకు కేవలం 5000 గ్రహాలను మాత్రమే కనుక్కున్నారు. వీటిలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా జీవాలు నివసించేందుకు అనకూలంగా లేవు.
