NTV Telugu Site icon

America- India: భారత్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ట్రంప్ సర్కార్.. జైశంకర్‌తోనే మొదటి సమావేశం!

Jaishankar

Jaishankar

America- India: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి సమావేశంలో జైశంకర్‌తో భేటీ అయ్యారు. రూబియోతో పాటు యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు కొనసాగించారు.

Read Also: Fire Accident: ఆయిల్ కంపెనీలో భారీ పేలుడు.. ఎగిసిపడ్డ మంటలు

ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.. అందులో క్వాడ్ గ్లోబల్ శక్తిగా కొనసాగుతుందన్నారు. రూబియోతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పెన్నీ వాంగ్, జపాన్‌కు చెందిన తకేషి ఇవాయాతో కూడిన క్వాడ్ మంత్రులు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించారని పేర్కొన్నారు. అలాగే, తన సహచరులతో స్వేచ్ఛా, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌ను నిర్ధారించడానికి “విభిన్న కొలతలు” గురించి చర్చించామన్నారు. ఇక, ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే క్వాడ్ ఎఫ్‌ఎమ్‌ఎమ్ జరగడం గమనార్హం.. విదేశాంగ విధానంలో ఉన్న సభ్య దేశాలకు ఇచ్చిన ప్రాధాన్యత అని జైశంకర్ పేర్కొన్నారు.