NTV Telugu Site icon

Kim Jong Un: కిమ్‌కి రష్యా గిఫ్ట్స్.. అవి ఏంటో తెలుసా..?

Putin Kim

Putin Kim

Kim Jong Un: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యం అమెరికా, వెస్ట్రన్ దేశాలకు కోపం తెప్పించింది. అయినా ఎక్కడా తగ్గకుండా కిమ్ నార్త్ కొరియా నుంచి తన ప్రత్యేక రైలులో రష్యా వ్లాదివోస్టాక్ చేరుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా కిమ్ దేశాన్ని వదిలి రష్యా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కిమ్ తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపారు.

Read Also: Jupiter: గురుగ్రహంపై భారీ ఫ్లాష్ లైట్.. ఏమై ఉంటుంది..?

ఇరు దేశాల మధ్య ఆయుధ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. రష్యా, ఉత్తర కొరియా నుంచి ఆర్టిలరీ షెల్స్, యాంటీ ట్యాంక్ క్షిపణులను కోరుకుంటోంది. బదులుగా రష్యా నుంచి శాటిలైట్, న్యూక్లియర్ సబ మెరైన్ టెక్నాలజీని నార్త్ కొరియా కోరుతోంది. శనివారం కిమ్ వ్లాడివోస్టాక్‌లో రష్యా రక్షణ మంత్రిని కలిసిన హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థతో సహా అత్యాధునిక ఆయుధాలను పరిశీలించారు. కొమ్సోమోల్స్క్‌లోని ఫైటర్ జెట్ ఫ్యాక్టరీని కూడా కిమ్ పరిశీలించారు. ఆదివారం వ్లాడివోస్టాక్‌లో చదువుతున్న ఉత్తర కొరియా విద్యార్థులతో కూడా కిమ్ సమావేశమయ్యారు. అంతకుముందు వెస్ట్రన్ దేశాలకు పుతిన్ సాగిస్తున్న పోరుకు కిమ్ మద్దతు తెలిపారు.

ఇదిలా ఉంటే ఉత్తరకొరియా అధినేతకు రష్యా కొన్ని విలువైన గిప్టులను బహూకరించింది. ఆరు డ్రోన్లను, బుల్లెట్ ఫ్రూఫ్ చొక్కాను బహూకరించినట్లు అక్కడి వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. ఆరు డ్రోన్లలో 5 కామికేజ్ డ్రోన్లు కాగా, ఒకటి నిలువగా ఎగిరే Geran-25 నిఘా డ్రోన్‌ ఉంది. వీటన్నింటిని ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఉన్న ప్రిమోరీ ప్రాంత గవర్నర్ కిమ్ జోన్ ఉంగ్ కి అందించారు. వీటితో పాటు థర్మల్ కెమెరాల ద్వారా గుర్తించబడని ప్రత్యేక దుస్తుల్ని కూడా అందించినట్లు రష్యా మీడియా టాస్ తెలిపింది.