NTV Telugu Site icon

Iran Supreme Leader: మేము రంగంలోకి దిగితే అలాంటి సంస్థల అవసరం లేదు..

Iran

Iran

Iran Supreme Leader: హమాస్‌, హెజ్‌బొల్లా, ఇస్లామిక్‌ జిహాద్‌లు తమ ముసుగు సంస్థలు కావు.. అవి స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్నాయని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ వెల్లడించారు. తాము నేరుగా రంగంలోకి దిగితే అసలు అలాంటి సంస్థల అవసరమే ఉండదన్నారు. మేం ఒంటరిగానే పోరాడుతామన్నారు. ఈ నెల మొదట్లో సిరియాలోని తిరుగుబాటుదారులు మెరుపుదాడులు చేసి ఇరాన్‌కు సన్నిహితుడైన అధ్యక్షుడు బషర్‌అల్‌ అసద్‌ సర్కార్ ను కూల్చేశారని ఖమేనీ మండిపడ్డారు. సిరియాలోని రెబల్స్ తో అమెరికా నేరుగా చర్చలు జరుపుతోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా పేర్కొన్నారు.

Read Also: Kareena Kapoor : నేనేం కొంపలు కూల్చనంటున్న స్టార్ హీరోయిన్

కాగా, హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ సహా ఇతర గ్రూపులతో తమ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నామని ఇప్పటికే అమెరికా తెలిపింది. అసద్‌ సిరియాను వదిలిపోయిన తర్వాత అమెరికా దౌత్యవేత్తలు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. సిరియాతో పశ్చిమ దేశాలు క్రమంగా సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

Read Also: Tollywood : టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్లపై టాలీవుడ్ చిన్నచూపు

మరోవైపు పాలస్తీనా, లెబనాన్‌కు కీలక ఆయుధాలు సరఫరా చేసే మార్గమైన సిరియాపై పట్టు కోల్పోవడంతో హెజ్‌బొల్లా, హమాస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ లాంటి సంస్థలకు ఇరాన్‌ నుంచి సాయం అందడం ఇబ్బందిగా మారడంపై అయాతొల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. యువత కొత్త గ్రూపు పాలనపై సంతృప్తిగా లేరని వెల్లడించారు. అమెరికాకు కిరాయి ముఠాగా పని చేసే ఏ గ్రూపునైనా తాము కాళ్ల కింద వేసి తొక్కి నలిపేస్తామని ఖమేనీ హెచ్చరించారు.

Show comments