Donald Trump: ‘‘విరమణ కాదు, ముగింపు కోసం చూస్తున్నాం’’.. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంపై ట్రంప్..
- కాల్పుల విరమణ కాదు, ముగింపు కోసం చూస్తున్నాం..
- ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణ 5వ రోజుకు చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి విరామం అవసరం లేదని చెప్పారు. ‘‘మేము కాల్పుల విరమణ కన్న మెరుగైన దానిని చూస్తున్నాము’’ అని విలేకరులతో అన్నారు. ‘‘కాల్పులు విరమణ కాదు, శాశ్వత ముగింపు’’ అని అన్నారు.
Read Also: Deputy CM Bhatti: అర్హులైన రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయి..
Also Read
- Donald Trump: "నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి" నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
- Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
- Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
రెండు దేశాల ఘర్షణ వల్ల 200 మందికి పైగా ప్రజలు చనిపోయారు. చమురు మార్కెట్లు ఈ ఘర్షణ వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రెండు దేశాల మధ్య శత్రుత్వానికి శాశ్వత ముగింపు ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా వైఖరి, ఇజ్రాయిల్‌కు అందించిన సహాయం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం, మేము చాలా బాగానే ఉన్నాము. గుర్తుంచుకోండి, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు’’ అని అన్నారు.
ఇదిలా ఉంటే, కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి ట్రంప్ ముందుగానే అమెరికాకు తిరిగి వచ్చారు. ఆయన అమెరికా వెళ్లడంపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ కోసం ట్రంప్ వెళ్లినట్లు చెప్పారు. అయితే, మక్రాన్ వ్యాఖ్యల్ని ట్రంప్ కొట్టిపారేశారు. ‘‘నేను ఎందుకు వాషింగ్టన్ వెళ్తున్నానో మక్రాన్‌కి తెలియదు. కాల్పుల విరమణతో ఖచ్చితంగా సంబంధం లేదు. దాని కన్నా పెద్దది’’ అని ట్రంప్ అన్నారు.
తాజావార్తలు
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!