Site icon NTV Telugu

America: బ్రిక్స్ దేశాలపై 100 శాతం పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరిక!

Donald Trump

Donald Trump

America: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్‌ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్‌ ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్ వాడకాన్ని తగ్గించడానికి ట్రై చేసే ఏ బ్రిక్స్ దేశం పైనైనా 100 శాతం పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

Read Also: Ravi Abburi: నేను ఇక ఆపేస్తా.. చాలు.. టాలీవుడ్ రచయిత సంచలనం!

ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యూఎస్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక వాణిజ్యాల్లో స్థానిక కరెన్సీల వాడకాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం.. ఇప్పటికే కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. ఈ బ్రిక్స్ దేశాలు అనుసరిస్తున్న విధానాలు అమెరికా ఆర్థిక పరపతికి ప్రత్యక్ష సవాలుగా ట్రంప్ భావిస్తున్నారు. అందుకే యూఎస్ తో వాణిజ్యం చేసే బ్రిక్స్‌ దేశాలపై భవిష్యత్తులో 100 టారిఫ్ లు విధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: Maha Kumbh Mela Monalisa: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? పూస‌ల‌మ్మే మోనాలిసాపై దారుణంగా

అయితే, డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలపై వివిధ వర్గాలు మండిపడుతున్నాయి. ఇలాంటి దూకుడు సుంకాల విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడంతో పాటు యూఎస్ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ట్రంప్ కఠిన నిబంధనలు పాటించాలని అతడి మద్దతుదారులు తెలియజేస్తున్నారు.

Exit mobile version