NTV Telugu Site icon

Donald Trump: భారత్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌.. 100 శాతం పన్నులు విధిస్తామని వెల్లడి!

Donald

Donald

Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించాడు. ఇది ఇలాగే కొనసాగితే మేం కూడా భారత్‌ ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధిస్తామని పేర్కొన్నారు. అలాగే, అమెరికా-చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న సుంకాలతో పాటు సంబంధిత అంశాలపై చర్చ జరిపారు.

Read Also: Chiranjeevi : అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?

ట్రంప్ కామర్స్‌ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక ట్యాక్స్‌లు విధిస్తున్నాయి. కానీ మేం ఆయా దేశాల వస్తువులపై పన్నులు విధించడం లేదని తేల్చి చెప్పారు. ఇకపై అలా చేయడం కుదరదు.. వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్‌ వేస్తే.. మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై సుంకాలు విధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, అధిక మొత్తంలో ట్యాక్సులు విధించే జాబితాలో బ్రెజిల్‌, భారత్‌లు ఉన్నాయని తెలిపారు. అమెరికాకు చెందిన వస్తువులపై రూ.100 నుంచి రూ.200 వరకు బ్రెజిల్‌, భారత్‌లు వసూలు చేస్తున్నాయి.. మేం కూడా అదే స్థాయిలో సుంకాలు వసూలు చేయబోతున్నామని డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

Show comments