Site icon NTV Telugu

Donald Trump: పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం.. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తా!

Trump

Trump

Donald Trump: జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వీకరించనున్నారు. అయితే, ఆయన ఇంకా గద్దెనెక్కక ముందే వివాదస్పద వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేపుతున్నారు. ఇప్పటికే కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా పేర్కొన్నారు. ఇక, ఆదివారం నాడు ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. అట్లాంటిక్, పసిఫిక్‌ సముద్రాలను కలిపే పనామా కాలువను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. యూఎస్ వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తుంది.. వీటిని తక్షణమే తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అమెరికాకు అప్పగించాలని హెచ్చరించాడు.

Read Also: S Jaishankar: నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.. ట్రంప్‌తో భేటీ అయ్యే ఛాన్స్..?

అయితే, అంతటితో ఆగలేదు డొనాల్డ్ ట్రంప్. డెన్మార్క్‌కు అమెరికా రాయబారిని ప్రటించారు.. ఆ దేశం అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తానంటూ మరో సంచలన వ్యాఖ్యా చేశారు. ఆయన 2016లో ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కూడా ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చాడు. నాడు ఈ కామెంట్స్ ను డెన్మార్క్‌ తిరస్కరించింది. తాజాగా, ఆ దేశానికి అమెరికా రాయబారిగా కెన్‌ హౌరీని నియమించిన డొనాల్డ్ ట్రంప్ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు.

Exit mobile version