Site icon NTV Telugu

Trump- Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రహస్యంగా టచ్‌లో ఉన్న డొనాల్డ్ ట్రంప్..

Trump

Trump

Trump- Putin: మరికొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ యూఎస్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్‌.. అత్యంత రహస్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కోవిడ్‌- 19 సమయంలో సీక్రెట్‌గా టెస్టు కిట్లు కూడా పంపించారని న్యూస్ ప్రచారం అవుతుంది. ఈ మేరకు యూఎస్‌కు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్‌ తాను రాసిన వుడ్‌వార్డ్ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు.

Read Also: IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన కివీస్.. స్టార్ ప్లేయర్ దూరం!

కోవిడ్-19కు సంబంధించిన టెస్టు కిట్లు పంపిణి చేసిన విషయం బయటకు చెప్పొద్దని.. ఇది తన ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ట్రంప్‌ను కోరారు అని యూఎస్ కు చెందిన ప్రముఖ్య జర్నలిస్ట్ తాను రాసిన వుడ్‌వార్డ్ పుస్తకంలో ప్రస్తావించారు. దీంతో పుతిన్‌తో ట్రంప్‌కు ఉన్న రహస్య సంబంధాలపై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version