US Presidential Elections: అమెరికా అధ్యక్షుడుని గెలిపించేవి ఈ 7 స్వింగ్ స్టేట్స్.. ట్రంప్, కమలా హారిస్ మధ్య టైట్ ఫైట్..
- అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించేవి ఈ 7 స్వింగ్ స్టేట్స్..
- కమలా హారిస్.. డొనాల్డ్ ట్రంప్ మధ్య టఫ్ ఫైట్..
- ఈ ఏడు రాష్ట్రాల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నెల రోజులు మాత్రమే ఉంది. డెమెక్రాట్ల తరుపున ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. నవంబర్ 05న జరగబోయే ఎన్నికల్లో ఇరువురి మధ్య టైట్ ఫైట్ ఉన్నట్లు పోల్స్ తెలుపుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది.
2024 అమెరికా ఎన్నికలకు సంబంధించి అరిజోనా, నెవెడా,విస్కాన్సిన్, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా రాష్ట్రాలు అధ్యక్షుడిని నిర్ణయించే స్వింగ్ రాష్ట్రాలుగా భావించబడుతాయి. ఈ రాష్ట్రాలే కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ కన్నా స్వల్ప ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్లు ఎమర్సన్ అండ్ ది హిల్ పోల్స్ పేర్కొన్నాయి.
Also Read
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
Read Also: Kolkata: డాక్టర్ల సామూహిక రాజీనామాలు తిరస్కరణ.. వ్యక్తిగతంగా సమర్పించాలన్న ప్రభుత్వం
ముఖ్యంగా పెన్సిల్వేనియా ఈ ఏడు రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన స్వింగ్ రాష్ట్రంగా నిలుస్తుంది. పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినాలోని రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చింది. ఈ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌కి స్వల్ప ఆధిక్యం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్లో 49 శాతంతో ముందు ఉండగా, కమలా హారిస్ 48 శాతం ఆధిక్యంలో ఉన్నారు. నెవడాలో మాత్రమే హారిస్‌కి ఎడ్జ్ కనిపిస్తోంది. ట్రంప్‌కి 47 శాతం ఉండగా, కమలా హారిస్‌కి 48 శాతం మద్దతు ఉంది. మిచిగాన్, విస్కాన్సిన్ ఇద్దరూ 49 శాతం మద్దతు కలిగి ఉన్నారు. ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ సర్వే ప్రకారం.. హారిస్‌కి ఆసియన్లు, యూత్‌లో ప్రజాదరణ ఉండగా, మిగతా వర్గాలు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు.
మరో సర్వే కూడా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్న విషయాన్ని చెబుతోంది. ‘‘వాల్ స్ట్రీట్ జర్నల్’’ పోల్ ప్రకారం.. ఏడు స్వింగ్ స్టేట్స్లో ఆరింటిలో ఇద్దరు రెండు శాతం పాయింట్ల తేడాలో ఉన్నట్లు చెప్పింది. అరిజోనా, జార్జియా, మిచిగాన్ రాష్ట్రాల్లో కమలా హారిస్ ఆధిక్యంలో ఉండగా.. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెడాలో ట్రంప్ ముందున్నారు. పోల్ ప్రకారం.. ట్రంప్ నెవెడాలో 5 శాతం ఆధిక్యంలో ఉండగా.. మిగతా చోట్ల ఫలితాలు మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌గా ఉన్నాయి.
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!