Site icon NTV Telugu

Donald Trump: “పిల్లలురా మీరు”.. ఇజ్రాయిల్-ఇరాన్‌పై ట్రంప్ వ్యాఖ్యలు..

Trump

Trump

Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెదర్లాండ్స్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయిల్, ఇరాన్‌లు ‘‘పాఠశాలల్లోని ఇద్దరు పిల్లలు’’ అని అభివర్ణించారు. ఇటీవల, కాల్పుల విరమణ తర్వాత కూడా ఇరు దేశాలు మిస్సైల్ దాడులు జరుపుకోవడంపై డొనాల్డ్ ట్రంప్ లైవ్ టీవీలో ‘‘ఎఫ్-వర్డ్’’ వాడటం ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మాట్లాడుతూ.. వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికి కొన్ని సార్లు ‘‘బలమైన భాషను’’ ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పారు.

Read Also: Crime News: మరో ఘటన.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

నాటో సమ్మిట్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. మంగళవారం యుద్ధ విరమణకు అంగీకరించిన తర్వాత ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణకు ఖచ్చితమైన స్టాప్ ఉంటుందని ట్రంప్ అన్నారు. ‘‘ వారు పాఠశాల ప్రాంగణంలో ఇద్దరు పిల్లల్లాగే పెద్ద గొడవ జరిగింది. వారు చాలా దారుణంగా పోరాడుతారు. మీరు వారిని ఆపలేరు, వారిని రెండు మూడు నిమిషాలు పోరాడనివ్వాలి, అప్పుడు ఆపడం సులభం అవుతుంది’’ అని ట్రంప్ సెటైర్లు వేశారు.

ట్రంప్ వ్యాఖ్యలపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే జోక్యం చేసుకుని..‘‘ తండ్రి కొన్ని సార్లు నిర్దిష్ట పదాన్ని ఉపయోగించాలి’’ అని అన్నారు. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ క్షిపణులను మార్పిడి చేసుకున్నప్పుడు నిరాశను వ్యక్తం చేస్తూ ట్రంప్ ప్రత్యక్ష టీవీలో F-వర్డ్ వాడారు. నెదర్లాండ్స్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో మిడిల్ ఈస్ట్ వివాదం చర్చకు వచ్చింది. ట్రంప్ తమ సైనిక వ్యయంలో వాటాను 5%కి పెంచాలని సభ్యులను కోరారు.

Exit mobile version