Donald Trump: భారత్- అమెరికా మధ్య గత 25 సంవత్సరాలుగా సంబంధాలు క్రమంగా పటిష్టం అవుతున్నాయి. కానీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. భారత్ నుంచి వెళ్తున్న డబ్బును ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని పలుమార్లు ఆయన ఆరోపించారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తక్షణమే ఆపాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
Read Also: TG Rains: ముసురుతో వణుకుతున్న హైదరాబాద్.. నేడు ఆరెంజ్ అలెర్ట్ జారీ
ట్రంప్ ను పట్టించుకోని మోడీ..
అయితే, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను భారత సర్కార్ పట్టించుకోకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్‌లను అమలు చేస్తోంది. భారత్- రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా పడిపోతాయని శాపనార్థాలు సైతం పెట్టారు. ఇక, ట్రంప్‌కు ప్రధాని మోడీ గట్టిగా సమాధానం ఇచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని వెల్లడించారు. టారిఫ్‌లకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
Read Also: Trump Tariffs India: నేటి నుంచే భారత్‌పై 50 శాతం సుంకాలు అమలు..
ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మోడీని ‘టెర్రిఫిక్ మ్యాన్’గా పేర్కొంటూ భారత్-పాక్ ఉద్రిక్తతలు తిరిగి మొదలవుతాయో లేదో తాను చెప్పలేనని, అయితే ఒకవేళ మొదలైతే తానే ఆపుతానని కవ్వించేలా వ్యాఖ్యానించారు. యూఎస్-భారత్ భాగస్వామ్యాన్ని దెబ్బతీయాలని ట్రంప్ యత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు అంచనాలు వేస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు.
