Donald Trump: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఆయన అమెరికాలో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మరోసారి ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని తాను 24 గంటల్లో పరిష్కరించగలనని తెలిపాడు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు అధ్యక్షత వహించడం ద్వారా తాను యుద్ధాన్ని అంతం చేస్తానని చెప్పారు. అయితే ఎలా పరిష్కరిస్తారనే దాన్ని వివరించడానికి ట్రంప్ తిరస్కరించారు.
Read Also: DCGI: దేశవ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై దాడులు.. 18 కంపెనీల లైసెన్సులు రద్దు..
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేలోగా యుద్ధం ముగియకపోతే, తాను అధ్యక్షుడైతే తాను ఒక రోజులోనే వివాదాన్ని పరిష్కరిస్తానని అన్నారు. గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్స్కీ మధ్య చర్చలు ఈజీగా చర్చలు జరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని అన్నారు. ఏడాదిన్నర వరకు చర్చలు ప్రారంభం కాబోవని, అది చాలా ఎక్కువ సమయం అని, ఈ లోగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల తనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. తాను 2020లో అధ్యక్ష పదవికి ఎన్నికైతే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. ట్రంప్ అణు ప్రపంచ యుద్ధం గురించి హెచ్చరించారు. ఎన్నికల నాటికి ఈ విషయం పరిష్కారం కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.
