Site icon NTV Telugu

US China Trade War: వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, ఈ వారం డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..

Trump Jinping

Trump Jinping

US China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం చివరలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్‌ చర్చిస్తారని వైట్‌హౌజ్ సోమవారం తెలిపింది. సుంకాలు, వాణిజ్య ఆంక్షలు తగ్గించడానికి చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్, జిన్ పింగ్ త్వరలోనే మాట్లాడుతారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.

ట్రంప్, జిన్ పింగ్ వాణిజ్య వివాదాలు పరిష్కరించడానికి అతి త్వరలో మాట్లాడుకుంటారని ‘‘ఫేస్ ఆఫ్ ది నేషన్’’ కార్యక్రమంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చెప్పారు. వీటిలో ముఖ్యమైనది ఖనిజాల వ్యవహారంలో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని మినరల్స్‌ని ఎగుమతి చేయడంలో చైనా పరిమితులు పెట్టుకుంది.

Read Also: Kamareddy: నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతైన ముగ్గురు యువకుల కోసం గాలింపు..

మరోవైపు, ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. గత నెలలో స్కాట్ బెస్సెంట్ నేతృత్వంలో జెనీవాలో చైనాతో చర్చలు జరిగాయి. ఇది ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధాన్ని తగ్గించింది. అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోది. అయితే, వాణిజ్యానికి సంబంధించి మరింత పనిచేయాల్సి ఉందని బెస్సెంట్ చెప్పారు.

యూఎస్-చైనా ఒప్పందం 90 రోజుల పాటు అధిక సుంకాలను నిలిపేసింది. అయితే, ఈ ఒప్పందం చైనా వస్తువులపై ట్రంప్ అధిక సుంకాల ప్రాథమిక కారణాలను పరిష్కరించలేదు. చైనా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతి ఆధారిత వ్యాపార వ్యూహాలను అమెరికా చాలా కాలంగా విమర్శిస్తోంది.

ఇదిలా ఉంటే, ట్రంప్ తన అత్యవసర అధికారాలను ఉపయోగించి చైనా దిగుమతులు, ఇతర దేశాలపై సుంకాలు విధించినప్పుడు, ఆయన తన అధికారాలను మించిపోయారని యూఎస్ ట్రేడ్ కోర్టు గత బుధవారం తీర్పు ఇచ్చింది. అయితే, ఫెడరల్ అప్పీల్ కోర్టు ఈ తీర్పును మరుసటి రోజు రద్దు చేసింది. కేసు సమీక్షా కాలంలో సుంకాలను అమలులో ఉంచేలా ఈ తీర్పు దోహదపడింది. జూన్ ప్రారంభం నాటికి కోర్టు రెండు పార్టీల నుంచి ప్రతిస్పందన కోరింది.

Exit mobile version