NTV Telugu Site icon

US: జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ప్రముఖులు గుసగుసలు, నవ్వులు.. వీడియో వైరల్

Us

Us

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్‌ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో అధ్యక్షుడు బైడెన్ దంపతుల సహా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, మాజీ అధ్యక్షుల కుటుంబాలు హాజరయ్యారు. అయితే ఆద్యంతం అందరూ గుసగుసలాడుకోవడం.. ముసిముసి నవ్వులతో కనిపించారు. ఇక కాబోయే అధ్యక్షుడు ట్రంప్-మాజీ అధ్యక్షుడు ఒబామా అయితే చాలా సేపు నవ్వుతూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సహజంగా అంత్యక్రయల సమయంలో ఎవరూ నవ్వుకోరు. బాధతోనో.. లేదంటే మౌనంగానో ఉంటారు. కానీ ఆశ్చర్యమేంటంటే.. ప్రార్థన జరుగుతున్న సమయంలో ప్రముఖలంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒబామా-ట్రంప్ మాట్లాడుకుంటుండగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓ లుక్ వేసి వెంటనే తిరిగి పోయారు. అంతకముందు కమలా హారిస్ దంపతులు కూడా నవ్వుతూ కనిపించారు. ఈ అంత్యక్రియలకు హాజరైన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ. బుష్, బిల్ క్లింటన్‌ మాట్లాడుకుంటూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు హాజరయ్యారు. వారందరూ ఒకేచోట ఆసీనులయ్యారు. ఈ క్రమంలో డొనాల్డ్‌ ట్రంప్‌ పక్కనే బరాక్‌ ఒబామా కూర్చున్నారు. కొంత సమయానికి వీరిద్దరి మధ్య సంభాషణ మొదలైంది.

 

Show comments