NTV Telugu Site icon

Donald Trump: నేరస్తుడిగా శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్..

Trump

Trump

Donald Trump: ఒక నేరస్థుడికి శిక్ష పడిన మొదటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. హుష్ మనీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌కి ఈ రోజు అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే, అతడికి ‘‘షరతులు లేని విడుదల’ శిక్ష విధించబడింది. అంటే, ప్రస్తుతం ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు తన ఆరోపణలకు దోషిగా తేలాడని అర్థం. జనవరి 20వ తేదీన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అధ్యక్షుడికి శిక్ష నుంచి పూర్తి మినహాయింపు లభించినట్లైంది. అమెరికన్ ప్రెసిడెంట్ హోదాలో చట్టానికి అతీతంగా ఉండే వెసులుబాటు ఉంది. దేశంలో అత్యున్నత పదవిని అధిరోహించే వ్యక్తిని దోషిగా నిర్ధారించి విధించే ఏకైక శిక్ష ‘‘బేషరతుగా విడుదల చేయడమే’’ అని న్యూయార్క్ న్యాయమూర్తి జువాన్ మెర్చన్ తీర్పును వెలువరించారు.

Read Also: UPSC: ఢిల్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ తేదీ మార్పు.. ఎప్పుడంటే..!

“ఈ కోర్టుకు ఇంతకు ముందు ఎన్నడూ ఇంత ప్రత్యేకమైన మరియు అద్భుతమైన పరిస్థితులను ఎదుర్కోలేదు” అని న్యాయమూర్తి అన్నారు. అమెరికాలోని అత్యున్నత పదవిని రాజ్యాంగం కాపాడుతుండడంతో, మాజీ అధ్యక్షుడికి “బేషరతుగా విడుదల” చేయడం తప్ప న్యాయమూర్తికి వేరే మార్గం లేదు. మరోవైపు తీర్పు ముందు.. వైట్‌హౌజ్లో మొట్టమొదటి నేరస్తుడు అనే అపఖ్యాతిని మూటకట్టుకోకుండా ఉండేందుకు ట్రంప్ తన శక్తిని, వనరుల్ని అన్నింటిని ఉపయోగించాడు.

ఈ కేసు ఏంటి..?

మే 2024లో ట్రంప్ వ్యాపార రికార్డులనున తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడ్డాడు. ట్రంప్ పోర్న్ స్టార్ స్మార్టీ డేనియల్స్‌తో లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టకుండా 2016 ప్రచారం సమయంలో ఆమెకు 1,30,000 డాలర్లను చెల్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ డబ్బు చెల్లింపులను కప్పిపుచ్చడానికి వ్యాపార రికార్డులను అవకతవకలకు పాల్పడ్డాడు.

Show comments