Site icon NTV Telugu

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇంటి నుంచి 11 సెట్ల రహస్య పత్రాలు స్వాధీనం

Donald Trump

Donald Trump

Donald Trump: మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిక్కులు తప్పేలా లేవు. అధ్యక్షుడిగా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొన్ని రహస్య పత్రాలను తనతో తీసుకెళ్లినట్లుగా..గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడం, న్యాయాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వం రికార్డులను నేరపూరితంగా నిర్వహించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. యూఎస్ లా డిపార్ట్మెంట్ ట్రంప్ పై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ బీ ఐ ఏజెంట్లు ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఇంటిలో పెద్ద ఎత్తున సోదాలు చేసింది. అయితే ఆ సయమంలో ఆ ఇంటి నుంచి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది ఎఫ్ బీ ఐ.

ప్రభుత్వం రహస్య పత్రాలను అక్రమంగా అతని ఇంట్లో ఉంచుకున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా 20 పెట్టెల్లో రహస్య పత్రాలను స్వాధీనం చేసుంది. మొత్తం ఇందులో 11 సెట్ల రహస్య పత్రాలను స్వాధీనం చేసుకుంది. మార్ ఎ లాగో రిసార్ట్ లో ప్రభుత్వ రహస్య పత్రాలతో పాటు కొన్ని ఫోటోలు దొరికాయి. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ వద్ద ఉన్న ట్రంప్ నివాసంలో రహస్య గదులను తెరిచి మరీ కొన్ని విలువైన పత్రాలను దొరికాయి. దొరికిన 11 సెట్ల డ్యాక్యుమెంట్లలో నాలుగు సెట్ల టాప్ సీక్రెట్ పత్రాలు, మూడు సెట్ల సీక్రెట్ పత్రాలు, మరో నాలుగు సెట్ల కాన్ఫిడెన్షియల్ పత్రాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో పాటు చెత్తో రాసిన నోట్లు, ఫోటోగ్రాఫ్ లను కూడా ట్రంప్ నివాసం నుంచి స్వాధీనం చేసుకుంది.

Read Also: Salman Rushdie: వెంటిలేటర్ పై సల్మాన్ రష్దీ.. దుండగుడి కత్తిపోట్లతో తీవ్రంగా గాయాలు

దొరికిన పత్రాల్లో రూజర్ స్టోన్ కు క్షమాభిక్షపెట్టిన పత్రాలు కూడా ఉన్నాయి. 2019లో ట్రంప్ స్నేహితుడు రోజర్ స్టోన్ కు క్షమాభిక్ష లభించింది. ఆ సమయంలో ట్రంపే వాటిపై సంతకాలు చేశారు. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా కలుగజేసుకుందా.. అనే విషయంపై అమెరికా కాంగ్రెస్ కు అబద్దాలు చెప్పారనే కేసులో మూడేళ్లు జైలు శిక్ష పడింది. ట్రంప్ ఈ శిక్షలను రద్దు చేశారు. రహస్య పత్రాల్లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన రహస్య సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా న్యూక్లియర్ బాంబులు, అటామిక్ ఎనర్జీ గురించిన సమాచారాన్ని కలిగి ఉన్నారని తెలుస్తోంది.

Exit mobile version