ఇంటర్నేషనల్ మార్కెట్‌లో జరిగే పరిణామాలతో డాలర్ విలువ మారుతూ ఉంటుంది. దాని ప్రభావం వల్ల భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు చాలా దేశాల డబ్బుల విలువలు మారుతుంటాయి. అయితే ప్రతి రోజు అమెరికా ఒక్క డాలర్‌కి ఇండియన్ రూపీ విలువ ఎంతుందో తెలుసుకోవాలనే అతృత అందిరికీ ఉంటుంది.
ప్రస్తుత్తం అమెరికా ఒక్క డాలర్‌కు విలువ ఇండియాలో రూ.74.42 పైసలు ఉంది. ఇదిలా ఉంటే.. పక్కనే ఉన్న పాకిస్థాన్‌లో ఎంతుందో తెలుసా.. ఒక్క డాలర్‌కు ఏకంగా రూ.174.22 పైసలు పలుకుతోంది. మన భారతీయ డబ్బు విలువ కంటే సుమారు రెండింతలు తక్కువగా పాకిస్థాన్ రూపాయి పతనమైంది. అంటే మన ఒక్క రూపాయికి పాకిస్థాన్ రూ.2.34లు అన్నమాట