NTV Telugu Site icon

COVID 19: మహమ్మారి అంతం అప్పుడే..!-డబ్ల్యూహెచ్‌వో

కోవిడ్‌ పేరు చెబితేనే ప్రపంచదేశాలు ఇప్పటికీ వణికిపోతున్నాయి.. ఎక్కడైనా వింత వ్యాధి వెలుగుచూసిందంటే.. దాని వెనుక కోవిడ్‌ మూలాలు ఉన్నాయా? అనే అనుమానంతో చూడాల్సిన రిస్థితి.. ఇప్పటికే ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ ఇలా.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై దాడి చేస్తూనే వస్తోంది హమ్మారి.. మరి, కోవిడ్‌కు అంతం ఎప్పుడు? దాని బారినుంచి బయటపడేది ఎన్నడు? అనే సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ‍్ల్యూహెచ్‌వో) కరోనా ముగింపు దశపై ఓ ప్రకటన చేసింది.

Read Also: Special Status: మోడీ ఏమన్నారు..? మీరు ఏం చెప్పారు..?

దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా కరోనా మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేశారు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్… వ్యాక్సినేషన్‌, కరోనా పీక్‌ స్టేజ్‌కు ముడిపెట్టారాయన.. ఈ ఏడాది జూలై, జూన్ మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయితే.. మహమ్మారి ప్రభావం కూడా తగ్గుతుందని.. పీక్ స్టేజ్ ముగిసే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. అలా.. వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గితే.. ఈ ఏడాది చివరి నాటికి కరోనా మహమ్మారి ముగింపు దశకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్.. కానీ, అది మన చేతిలోనే ఉందని చెప్పలేమన్నారు.. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పస్టం చేశారు. కాగా, భారత్‌ సహా చాలా దేశాల్లో కోవిడ్‌ థర్డ్‌ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.. భారత్‌లో తాజా కేసుల సంఖ్య 50 వేల దిగువకు పడిపోయింది..