NTV Telugu Site icon

Covid-19: మెదడు నాళాలను దెబ్బతీస్తున్న కోవిడ్.. రీసెంట్ స్టడీలో వెల్లడి

Corona Effect On Brain

Corona Effect On Brain

కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ మెదడును కూడా ప్రభావితం చేస్తోంది. మనం వ్యాధినిరోధక వ్యవస్థ కరోనా వైరస్ తో పోరాడుతున్న క్రమంలో మన మెదడును దెబ్బతీస్తోందని తాాజా అధ్యయనంలో వెల్లడైంది. యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) ఈ అధ్యయాన్ని నిర్వహించింది. కరోనా బారిన పడి మరణించిన తొమ్మిది మందిపై ఈ అధ్యయనాన్ని చేశారు. చనిపోయిన 9 మంది మెదడులో మార్పులు వచ్చినట్లు గమనించారు పరిశోధకులు. మన ఇమ్యూన్ సిస్టం తప్పుగా పొరబడి మెదడు రక్త నాళాలను దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. ఇమ్యున్ సిస్టమ్ లోని యాంటీబాడీస్ రక్త నాళాలను కప్పి ఉంచే కణాలపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఇది రక్త నాళాల వాపు, లీకేజీలకు కారణం అవుతుందని గుర్తించారు.

అయితే ఇక్కడ కరోనా వైరస్ నేరుగా మెదడుపై ప్రభావాన్ని చూపించడం లేదని.. ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మెదడు ప్రభావితం అవుతుందని పరిశోధకుడు అవీంద్ర నాథ్ వెల్లడించారు. చనిపోయిన వారికి శవపరీక్షలు చేయగా.. మెదడులోని రక్తనాళాలు ప్రభావితం అయినట్లుగా గుర్తించామని వెల్లడించారు. మొదట్లో దీనికి కారణం ఏమిటో అర్థం కాలేదని.. తర్వాత మన ఇమ్యున్ సిస్టమ్ కణాలే రక్త నాళాలపై దాడి చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

Read Also: Ponniyan Selvan: పగతో రగులుతున్న ఐశ్వర్యరాయ్.. ఎవరిపైనంటే..?

కోవిడ్ వైరస్ కు వ్యతిరేకంగా ఉత్పత్తి చేయబడిన యాంటీబాడీస్ మెదడులోని నాళాలను ప్యాక్ చేసే ఎండోథెలియల్ కణాలను దెబ్బతీస్తున్నాయని తేలింది. మెదడుకు హానికరమైన పదార్థాలు చేయకుండా ఎండోథెలియల్ కణాలు అడ్డుపడుతుంటాయి. అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ కణాలు ఈ ఎండోథెలియల్ కణాలను దెబ్బతీయడం వల్ల రక్తం నుంచి ప్రొటీన్లు లేకేజీ అవుతాయి. దీంతో మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావానికి కారణం అవ్వడంతో పాటు స్ట్రోక్ కు కారణం అవుతోందని పరిశోధనల్లో తేలింది. 24 నుండి 73 సంవత్సరాల వయస్సు గల తొమ్మిది మందిపై ఈ అధ్యయనం చేశారు.